సుప్రీంకోర్టులో మాజీ మంత్రి హరీష్ రావు కు ఊరట లభించింది. ఫోన్ టాపింగ్ కేసులో హరీష్ రావు విచారణకు అనుమతించాలన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
ఫోన్ టాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావు విచారణకు అనుమతించాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. ఇవాళ జనవరి 5న జస్టిస్ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నేత్రత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్ర రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలను వినిపించారు.
ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై గతంలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో హరీష్ రావుపై కేసు నమోదైన విషయం తెలిసిందే. చక్రధర్ గౌడ్ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును సవాల్ చేస్తూ హరీష్ రావు హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో హరీష్ రావుపై నమోదైన ఎఫ్ఐఆర్ను హైకోర్టు క్వాష్ చేసింది. హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టును ఆశ్రయించారు చక్రధర్ గౌడ్.
హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. చక్రధర్ గౌడ్ పిటిషన్ లోనే హరీష్ రావు విచారణకు అనుమతించాలని కోరింది. ఈ క్రమంలో రెండు పిటిషన్లను ఇవాళ విచారించిన సుప్రీంకోర్టు.. హైకోర్టు ఆదేశాల్లో తాము జోక్యం చేసుకోవాలని తెలిపింది.
