ఓటు వేయలేదని ఇంటిపై దాడి , కుల బహిష్కరణ..

ఓటు వేయలేదని ఇంటిపై  దాడి , కుల బహిష్కరణ..

సిద్దిపేట జిల్లాలో దారుణం జరిగింది. నంగునూరు మండలం తిమ్మాయిపల్లి గ్రామంలో తనకు ఓటు వేయలేదని దాడి చేశాడు ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి. సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన కృష్ణా రెడ్డి అనుచరులతో  తనకు ఓటేయలేదని మధుసూదన్ రెడ్డి ఇంటిపై దాడి చేశారు. తమ కులస్తుడికి ఓటు వేయలేదని మధుసూదన్ రెడ్డిని కులబహిష్కరణ చేశారు రెడ్డికుటుంబ సభ్యులు. దాడి చేసిన వారిపై రాజగోపాల్ పేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు మధుసూదన్ రెడ్డి కుటుంబ సభ్యులు. ప్రస్తుతం సిద్దిపేట జిల్లా ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు మధుసూదన్ రెడ్డి.

 తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు 2025 డిసెంబర్ లో మూడు విడతల్లో జరిగిన సంగతి తెలిసిందే..డిసెంబర్ 11,14,17న మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఏక‌‌‌‌గ్రీవ పంచాయ‌‌‌‌తీలు క‌‌‌‌లిపి 12,702 పంచాయ‌‌‌‌తీల్లో సర్పంచ్, ఉప‌‌‌‌ స‌‌‌‌ర్పంచ్, 85,955 మంది వార్డు సభ్యులు డిసెంబర్ 22న ప్రమాణ స్వీకారం చేశారు.