కరోనా రెండో ఏడాది మరింత డేంజర్

కరోనా రెండో ఏడాది మరింత డేంజర్

జెనీవా: కరోనా తొలి ఏడాది కంటే రెండో సంవత్సరం మరింత ప్రమాదకరంగా ఉండనుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లూహెచ్ఓ) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రియోస్ అన్నారు. కరోనా విషయంలో తొలి ఏడాదిని దాటి రెండో సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నామని, ఇది భీకరంగా ఉంటుందని టెడ్రోస్ హెచ్చరించారు. మహమ్మారి బారి నుంచి బయటపడాలంటే వ్యాక్సినేషన్ ఒకటే మార్గమని సూచించారు. ప్రజల ప్రాణాలను కాపాడటంలో టీకా ప్రక్రియ కీలకమని దీన్ని ప్రణాళికాబద్ధంగా అమలు చేయాలని పేర్కొన్నారు.