వీడియో: కరోనా వచ్చిందని ఆస్పత్రి ఆరో అంతస్తు నుంచి దూకిన బ్యాంక్ మేనేజర్

వీడియో: కరోనా వచ్చిందని ఆస్పత్రి ఆరో అంతస్తు నుంచి దూకిన బ్యాంక్ మేనేజర్

దేశంలో కరోనాతో చాలామంది చనిపోతుంటే.. కరోనా వచ్చిందని భయంతో మరికొంతమంది సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. అటువంటి ఘటనే ఉత్తరప్రదేశ్ లోని మొరదాబాద్ లో జరిగింది.

మొరదాబాద్ కు చెందిన రాజేష్ కుమార్ అనే 42 ఏళ్ల వ్యక్తి రామ్ గంగా విహార్ లో భార్య, ఇద్దరు పిల్లలతో నివసిస్తున్నాడు. ఆయనకు రెండు రోజుల క్రితం జలుబు, దగ్గు రావడంతో.. కరోనా టెస్టు చేయించుకున్నారు. అందులో ఆయనకు పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దాంతో రాజేష్ ను ఆగష్టు 26 నుంచి తీర్ధాంకర్ మహావీర్ యూనివర్సిటీ మెడికల్ కాలేజ్ లో ఉంచి వైద్యం అందిస్తున్నారు. అయితే ఏం అనిపించిందో తెలియదు కానీ.. ఆస్పత్రిలో చేరిన రెండు రోజుల తర్వాత ఆగష్టు 28 గురువారం రాత్రి ఆస్పత్రిలోని ఆరో ఫ్లోర్ నుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే అక్కడకు చేరుకున్న అధికారులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.

ఇలా ఆస్పత్రి పైనుంచి దూకి కోవిడ్ పేషంట్లు చనిపోవడంగత పది రోజుల్లో ఇది రెండోసారి. గత వారం 28 ఏళ్ల యువతి రెండో ఫ్లోర్ నుంచి తప్పించుకునే క్రమంలో పైనుంచి కిందపడి చనిపోయింది.

For More News..

చెన్నై సూపర్ కింగ్స్ కు వరుస షాకులు.. ఐపీఎల్ నుంచి రైనా అవుట్..

క్యాన్సర్ తో ‘బ్లాక్ పాంథర్’ హీరో మృతి

పుల్వామాలో ఎన్‌కౌంట‌ర్.. ఒక జవాను.. ముగ్గురు టెర్రరిస్టులు మృతి