భారత్ లో కరోనా థర్డ్ వేవ్ తీవ్రత అంతగా ఉండదు

భారత్ లో కరోనా థర్డ్ వేవ్ తీవ్రత అంతగా ఉండదు

కరోనా సెకండ్ వేవ్ లో వేలాది మంది చనిపోయారు. ప్రస్తుతం వైరస్ ఉద్ధృతి తగ్గినా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో ICMR కీలక ప్రకటన చేసింది. భారత్లో కరోనా థర్డ్ వేవ్ రావడానికి అవకాశాలు తక్కువగానే ఉన్నట్లు తెలిపింది. ఒకవేళ వచ్చినా సెకండ్ వేవ్ అంత తీవ్రంగా ఉండదని చెప్పింది. ఈ ముప్పును ఎదుర్కోవడంలో వేగంగా కొనసాగుతున్న వ్యాక్సినేషన్ కీలక పాత్ర పోషిస్తుందని ICMR తెలిపింది.

ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ ఇతర వైద్య నిపుణులతో కలిసి అధ్యయనం చేశారు. థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలు తక్కువేననే విషయం ఈ అధ్యయనంలో తేలింది. రోగనిరోధక శక్తి క్షీణించటం, రోగనిరోధక శక్తిని తప్పించుకొనేలా వైరస్లో మార్పులు రావటం వంటి కారణాలు మూడో ఉద్ధృతికి దారితీసే అవకాశాలు తక్కువేనని అభిప్రాయం వ్యక్తం చేశారు.