దేశంలో ఒక్క రోజే 1.60 లక్షల కేసులు

దేశంలో ఒక్క రోజే 1.60 లక్షల కేసులు
  • యాక్టివ్​ కేసులు 6 లక్షలకు దగ్గరైనయ్
  • గత 224 రోజుల్లో ఇవే ఎక్కువ
  • 3,623కు చేరిన ఒమిక్రాన్ బాధితుల సంఖ్య

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజుకు మించి రోజు భారీగా పెరుగుతున్నయి. కొత్తగా 1,59,632 మందికి వైరస్ సోకిందని, గత 224 రోజుల్లోనే అత్యధిక డైలీ కేసులని ఆదివారం ఉదయం కేంద్ర హెల్త్ మినిస్ట్రీ వెల్లడించింది. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,55,28,004కు పెరిగినట్లు తెలిపింది. దేశంలో యాక్టివ్ కేసులు 5,90,611కు చేరాయని పేర్కొంది. ఇక వైరస్ బారిన పడి మరో 327 మంది చనిపోగా, మొత్తం మృతుల సంఖ్య 4,83,790కి పెరిగింది. ఢిల్లీలో మరో 20,181 మందికి వైరస్ పాజిటివ్ వచ్చింది. వైరస్ తో ఏడుగురు చనిపోయారు.   
మరో 552 మందికి ఒమిక్రాన్
దేశవ్యాప్తంగా మరో 552 మందికి కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సోకింది. ఇప్పటివరకు 27 రాష్ట్రాలు, యూటీల్లో మొత్తం 3,623 కొత్త వేరియంట్ కేసులు నమోదయ్యాయని కేంద్రం తెలిపింది. అత్యధికంగా మహారాష్ట్రలో 1,009, ఢిల్లీలో 513, కర్నాటకలో 441, రాజస్తాన్ లో 373, కేరళలో 333, గుజరాత్ లో 204 మంది కొత్త వేరియంట్ బారిన పడ్డారు. మొత్తం 1,409 మంది ఒమిక్రాన్ నుంచి కోలుకున్నారు.
రూల్స్ పాటిస్తే లాక్ డౌన్ పెట్టం: కేజ్రీవాల్ 
ప్రజలు మాస్క్ లు పెట్టుకుని, డిస్టెన్స్ పాటిస్తూ, కరోనా రూల్స్ ను పక్కాగా అనుసరిస్తే ఢిల్లీలో లాక్ డౌన్ పెట్టాల్సిన అవసరం ఉండదని సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. అత్యవసరమైతేనే ప్రజలు బయటకు రావాలని కోరారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత తొలిసారి ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. హోంఐసోలేషన్​లో ఉన్న టైంలో హెల్త్ మినిస్టర్, ఆఫీసర్లు, సిబ్బందితో కరోనా సిచువేషన్​పై రివ్యూ చేసినట్లు తెలిపారు. కేసులు పెరగడంపై ప్రజలు ప్యానిక్ కావద్దని, బాధ్యతగా వ్యవహరిస్తే చాలని అన్నారు. నిరుడు మే 7న ఒకేరోజు 20 వేలకుపైగా కేసులు వచ్చాయని, ఇప్పుడు మళ్లీ ఆ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయని చెప్పారు. అప్పటితో పోల్చుకుంటే హాస్పిటల్స్​లో చేరికలు, డెత్స్ చాలా తక్కువగా ఉన్నాయన్నారు. ప్రతి ఒక్కరూ టీకాలు వేసుకోవాలని, వ్యాక్సిన్ వేసుకున్నోళ్లకే కరోనా ముప్పు తగ్గుతుందన్నారు.
పార్లమెంట్ సిబ్బంది 
400 మందికి కరోనా
దాదాపు 400 మంది పార్లమెంట్ సిబ్బంది కరోనా బారిన పడ్డారని అధికార వర్గాలు తెలిపాయి. ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్నందున పార్లమెంట్ సిబ్బందికి టెస్టులు చేశామని చెప్పాయి. ఈ నెల 4 నుంచి 8 తేదీ మధ్య మొత్తం 1409 మంది పార్లమెంట్ సిబ్బందికి టెస్టులు చేశారు. ఇందులో రాజ్యసభ సెక్రటేరియెట్​లో 65 మంది, లోక్​సభ సెక్రటేరియెట్​లో 200మంది, అనుబంధ సర్వీసులకు చెందిన 133 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం వీళ్లంతా ఐసోలేషన్​లో ఉన్నారని, మిగిలిన సిబ్బందిపై ఆంక్షలు విధించామని అధికారులు తెలిపారు.
బీజింగ్​కు దగ్గరి సిటీలో టెన్షన్  
చైనా రాజధాని బీజింగ్ కు దగ్గర్లోనే ఉన్న తియాన్జిన్ సిటీలో తాజాగా 18 కరోనా కేసులు, 2 లోకల్ గా ట్రాన్స్ మిట్ అయిన ఒమిక్రాన్ కేసులు నమోదు కావడంతో అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. తియాన్జిన్ నుంచి కేవలం 30 నిమిషాలు ట్రెయిన్ ప్రయాణం చేస్తే బీజింగ్ కు చేరుకునే చాన్స్ ఉండటంతో రాజధానికి రోజూ వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. మరోవైపు త్వరలోనే బీజింగ్ లో వింటర్ ఒలింపిక్స్ జరగనుండటంతో తియాన్జిన్ నుంచి కరోనా వ్యాపించే ప్రమాదం ఉందని అధికారులు టెన్షన్ పడుతున్నారు. అందుకే తియాన్జిన్ సిటీలోని మొత్తం 1.40 కోట్ల మంది ప్రజలకు కరోనా టెస్టులు చేసేందుకు అధికారులు భారీ డ్రైవ్ ను షురూ చేశారు.  
యూకేలో లక్షన్నర దాటిన డెత్స్ 
బ్రిటన్ లో శనివారం మరో 313 మంది కరోనాతో చనిపోయారు. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య 1.50 లక్షలు దాటింది. కొత్తగా 1,46,390 కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 1.43 కోట్లు దాటింది. కరోనా వల్ల దేశంలో లక్షన్నర మంది చనిపోయారని శనివారం ప్రధాని బోరిస్ జాన్సన్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రజలంతా వ్యాక్సిన్ లు తీసుకోవాలని కోరారు. కరోనా నుంచి ప్రజలను కాపాడటంలో నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్ హెచ్ఎస్) సిబ్బంది ఎనలేని కృషి చేస్తున్నారని, ఎన్​హెచ్ఎస్​ సిబ్బంది అందరికీ థ్యాంక్స్ చెప్పారు.