అరుణ్ బతకడం అద్భుతమే

అరుణ్ బతకడం అద్భుతమే


కోవిడ్ పై యుద్ధంలో కేరళకు చెందిన ఫ్రంట్ లైన్ వర్కర్ అరుణ్ కుమార్ పోరాడి గెలిచాడు. దాదాపు ఆరు నెలలు ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుని క్షేమంగా బతికి బయటపడ్డాడు. కృత్రిమ ఊపిరితిత్తుల సాయంతో శ్వాస తీసుకుని కరోనాపై గెలిచి విజేతగా తిరిగివచ్చాడు. దాదాపు 118 రోజుల పాటు బతుకు పోరాటంలో మృత్యువతో పోరాడి నిలిచాడు. అరుణ్ కుమార్ అబుదాబిలో ఫ్రంట్ లైన్ వర్కర్ గా ఓ హాస్పిటల్ లో ఆపరేటింగ్ థియేటర్ లో టెక్నీషియన్ గా పనిచేసేవాడు. జులై 2021లో అతను కోవిడ్ బారిన పడ్డాడు. హోం ఐసోలేషన్ ఉండి ట్రీట్ మెంట్ తీసుకున్నా ఫలితం లేకుండా ఫోయింది. ఆరోగ్యం క్షీణించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు. వెంటనే అబుదాబిలోని ఎల్ఎల్ హెచ్ ఆస్పత్రిలో  జాయిన్ చేశారు. అన్ని పరీక్షలు చేసిన వైద్యులు అరుణ్ కుమార్ ఊపిరితిత్తులకు ఇన్ ఫెక్షన్ సోకినట్లు తేలింది. వెంటనే అతడిని కృత్రిమ ఊపిరితిత్తుల  అమర్చారు. వాటి సహాయంతో ఊపిరి పీల్చుకోవడం ప్రారంభించారు. ఒకానొక సమయంలో గుండె సంబంధిత సమస్యలు కూడా తలెత్తాయి. అయినా వీటన్నింటిని తట్టుకుని క్షేమంగా బయటకు వచ్చాడు. అతని చికిత్సకు వీపీఎస్ హెల్త్ కేర్ గ్రూప్ మద్దతు తెలిపింది. అతని చికిత్సకు దాదాపు 50 లక్షల రూపాయల సాయం చేసింది. ఇప్పుడు అరుణ్ ఆరోగ్యం కుదుట పడటంతో స్వరాష్ట్రం కేరళకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. కుటుంబ సభ్యులు, స్నేహితులను ఎప్పుడెప్పుడు కలుసుకుంటానా అని ఆరాట పడుతున్నారు. తనకు పునర్జన్మను ప్రసాదించిన వైద్యులకు ధన్యవాదాలు తెలిపారు. తన ప్రాణాలను కాపాడేందుకు వారు చేసిన కృషిని ఎప్పటికి మర్చిపోలేనని భావోద్వేగంతో చెప్పాడు.

మరిన్ని వార్తల కోసం

వీడనున్న ‘బిగ్ బ్యాంగ్’ గుట్టు !

కొరియా దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు