కొరియా దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు

కొరియా దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు
  • ఉత్తర కొరియ బాలిస్టిక్ మిస్సైళ్లను ప్రయోగించిందన్న దక్షిణ కొరియా
  • అమెరికాపై ఒత్తిడి పెంచేందుకేనని నిపుణుల అభిప్రాయం

ఉత్తర కొరియా మళ్లీ ఉద్రిక్తతలు రాజేసింది. మరోసారి క్షిపణి ప్రయోగాలు చేసింది. నిన్న రెండు బాలిస్టిక్ మిసైళ్లను ప్రయోగించిందని దక్షిణ కొరియా సైనికాధికారులు వెల్లడించారు. ఇది జనవరి నెలలో జరిగిన ఆరో ప్రయోగంగా తెలిపారు.  తాజా క్షిపణులను జపాన్ సముద్రంలోకి ప్రయోగించారని వారు అంటున్నారు. అమెరికాపై ఒత్తిడి పెంచేందుకే క్షిపణులు ప్రయోగించినట్లు నిపుణులు తెలుపుతున్నారు. అణు పరీక్షలను ముమ్మరం చేస్తామని ఇటీవల ఉత్తర కొరియా ప్రకటించింది. దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఇవి కూడా చదవండి..

చిరంజీవికి సీఎం కేసీఆర్ ఫోన్

వరి పొలాల్లో వలస కూలీలు