కరోనా వారియర్స్‌‌కు తొలి టీకా.. 10 రోజుల్లో వ్యాక్సినేషన్ డ్రైవ్ స్టార్ట్

కరోనా వారియర్స్‌‌కు తొలి టీకా.. 10 రోజుల్లో వ్యాక్సినేషన్ డ్రైవ్ స్టార్ట్
న్యూఢిల్లీ: దేశంలో కొవిషీల్డ్, కోవ్యాక్సిన్ టీకాలకు అనుమతి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యాక్సిన్‌‌లకు సంబంధించి మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించలేదని, ఈ టీకాలు సురక్షితం కాదంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీటి పై కేంద్రం స్పందించింది. అనుమతి పొందిన రెండు టీకాలు చాలా సురక్షితం అని కేంద్రం తెలిపింది. వ్యాక్సినేషన్ పై అన్ని వివరాలను ఆన్‌‌లైన్‌‌లో పంపిస్తామని ఆరోగ్య శాఖ సెక్రెటరీ రాజేశ్ భూషణ్ తెలిపారు. కరోనా వారియర్స్‌‌కు తొలుత టీకాను అందిస్తామని, వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని కో-విన్ అనే యాప్‌‌లో అందిస్తామని పేర్కొన్నారు. వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వచ్చినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నాక సర్టిఫికేట్ ఇస్తామన్నారు. రోగనిరోధక శక్తి ఆధారంగానే వ్యాక్సిన్ అందిస్తామని చెప్పారు. కోతుల్లో కొవిషీల్డ్ వ్యాక్సిన్ న్యూమోనియా తగ్గించిందన్నారు. దేశంలో మరో పది రోజుల్లో ఇమ్యూనైజేషన్ డ్రైవ్ మొదలవుతుందన్నారు. తొలుత ముంబై, చెన్నై, కోల్‌‌కతాతోపాటు హర్యానాలోని కర్నాల్‌‌లోని ప్రభుత్వ మెడికల్ స్టోర్స్‌‌కు వ్యాక్సిన్‌‌ను పంపిస్తామని, అక్కడి నుంచి దేశంలోని 37 స్టేట్ వ్యాక్సిన్ స్టోర్లకు టీకాలను పంపిణీ చేస్తామని వివరించారు.