
బషీర్బాగ్, వెలుగు: దేశంలో గోవధ నిషేధ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని బీజేపీ లీడర్ చీకోటి ప్రవీణ్ డిమాండ్చేశారు. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటిస్తూ పార్లమెంట్ లో తీర్మానం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో నమో మిషన్ వందే గో మాతరం అధ్యక్షుడు వీర మద్వీరాజ్ తో కలిసి ఆయన మాట్లాడారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం గో సంరక్షణను విస్మరించిందన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గోవధపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించే అంశంపై బీజేపీ ఎంపీలపై ఒత్తిడి తీసుకువస్తామన్నారు. గోవును రక్షించాలనే ఉద్దేశంతో ధర్మరక్షను ఏర్పాటు చేసి పోరాటం చేస్తున్నట్లు చీకోటి తెలిపారు.