కంటైనర్లో ఆవులు తరలింపు.. ఊపిరాడక 15 ఆవులు మృతి..

కంటైనర్లో ఆవులు తరలింపు.. ఊపిరాడక 15 ఆవులు మృతి..

అక్రమంగా గోవులను తరలిస్తున్న ముఠాను పట్టుకున్నారు పోలీసులు. హైవేపై కంటేనర్లో తరలిస్తున్నారని పక్కా సమాచారం రావడంతో రైడ్ చేశారు. ఈ దాడిలో 26 ఆవులను పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. సూర్యాపేట జిల్లా మటంపల్లి మండలం మట్టపల్లిలో కంటైనర్లో గోవులను తరలిస్తున్నారని పోలీసులకు పక్కా సమాచారం వచ్చింది. దీంతో రైడ్ చేశారు.  

కంటైనర్ లో మొత్తం 26 ఆవులు ఉన్నట్టు గుర్తించారు. అందులో ఊపిరాడక 15 ఆవులు మృతి చెందినట్టు నిర్ధారించారు. ఆవులు పల్నాడు జిల్లా గురజాలకు చెందినవిగా గుర్తించారు పోలీసులు. తొమ్మిది ఆవులు నల్గొండ గోశాలకు తరలించారు. రెండు ఆవులకు కాళ్లు విరగగా చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.  

ఇదిలా ఉంటే ఆవులు పట్టుకున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మే 28 2024  మంగళవారం రోజు ఆవులు పట్టుకుంటే మే29 2024  విషయం వెలుగులోకి వచ్చింది. సెటిల్మెంట్ చేసుకునే క్రమంలో ఆవులు ఉన్న కంటైనర్ను పోలీసులు నిర్లక్ష్యం చేశారంటూ ఆరోపణలు వస్తున్నాయి. 

 సెటిల్మెంట్ కుదరక  ఉన్నతాధికారి చెప్పడంతో రాత్రి 8 గంటలకు పోలీసులు ఎఫ్ఐఆర్ చేసినట్టుగా స్థానికులు గుసగుసలాడుతున్నారు. చినిపోయిన ఆవులకు  పోస్టుమార్టం నిర్వహిస్తున్న పశువైద్యులు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.