రాజన్న ఆలయానికి కోడెలు ఎంతో ప్రాముఖ్యమన్నారు సీఎం ఓఎస్డీ శ్రీనివాస్. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో రాజన్న గోశాలను సందర్శించానని చెప్పారు. 400 ఉండాల్సిన గోశాల షేడ్ లో 1500 వరకు ఉన్నాయని.. కొంత అనారోగ్యం కారణంగా కోడెలు మృతి చేందుతున్నాయని చెప్పారు. బురద నీరు లేకుండా సీసీ రోడ్ నిర్మాణం, కొత్త షేడ్స్ నిర్మాణం కోసం ఆదేశాలు జారీ అయ్యాయని తెలిపారు.
గోశాల ఆధునికరణ కోసం మరిన్ని నిధులు వేచిస్తామని తెలిపారు. కోడెల సంరక్షణ కోసం ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాజన్న గోశాలలో పర్మనెంట్ గా వైద్య సిబ్బందిని నియమిస్తామని తెలిపారు. భక్తుల మనోభావాలను గౌరవించేందుకు ప్రతి చర్యలు తీసుకుంటామన్నారు ఓఎస్డీ శ్రీనివాస్.
