V6 News

గోరక్షణ కోసం సంతకాల సేకరణ.. ప్రత్యేక చట్టం ఏర్పాటు చేయాలని లవ్ ఫర్ కౌ ఫౌండేషన్ డిమాండ్

గోరక్షణ కోసం సంతకాల సేకరణ.. ప్రత్యేక చట్టం ఏర్పాటు చేయాలని లవ్ ఫర్ కౌ ఫౌండేషన్ డిమాండ్

​సైఫాబాద్, వెలుగు: గో సంరక్షణే లక్ష్యంగా ‘లవ్ ఫర్ కౌ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో గో ప్రేమికులు సంతకాల సేకరణ ఉద్యమాన్ని చేపట్టారు. గోవును జాతీయ ప్రాణిగా గుర్తించాలని, గో సేవ కోసం ప్రత్యేక కేంద్ర చట్టంతో పాటు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ జస్మాత్ పటేల్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన సంతకాలను రాష్ట్రపతి, ప్రధానికి అందజేస్తామని తెలిపారు. ఇదే విషయమై హైదరాబాద్ కలెక్టరేట్​లో మంగళవారం వినతిపత్రం సమర్పించినట్లు చెప్పారు.