సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి : సీపీ అంబర్‌ కిశోర్‌‌ ఝా

సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి : సీపీ అంబర్‌ కిశోర్‌‌ ఝా

గోదావరిఖని, వెలుగు: శాంతి భద్రతలు, నేరాల నియంత్రణలో పోలీస్‌ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని రామగుండం సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా సూచించారు. గురువారం గోదావరిఖనిలో రామగుండం కమిషనరేట్‌లో పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పోలీస్​అధికారులతో ఆరు నెలల నేర సమీక్ష మీటింగ్ నిర్వహించారు. సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. కేసుల దర్యాప్తులో అధికారులు టెక్నాలజీని వినియోగించుకోవాలన్నారు. గతంలో నమోదైన పెండింగ్  కేసులను త్వరగా  పరిష్కరించాలన్నారు. 

ముఖ్యంగా మహిళలపై జరిగిన నేరాల కేసుల్లో దర్యాప్తు స్పీడప్‌ చేయడంతో పాటు, నిందితులకు కోర్టులో శిక్షలుపడేలా సాక్ష్యాలు సమర్పించాలని సూచించారు. మహిళలు, బాలికల మిస్సింగ్‌ కేసుల్లో అధికారులు వేగంగా స్పందించాలన్నారు. రానున్న పంచాయితీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఎస్‌హెచ్‌వోలు తమ పరిధిలోని గ్రామాలను సందర్శించాలని, విజివల్​ పోలీసింగ్‌పై దృష్టి పెట్టాలన్నారు. మీటింగ్‌లో మంచిర్యాల డీసీపీ ఎ.భాస్కర్, పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, అడిష నల్ డీసీపీ అడ్మిన్ సి.రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ మల్లారెడ్డి,  ఏసీపీలు ఆర్.ప్రకాశ్, వెంకటేశ్వర్లు, రవికుమార్, శ్రీనివాస్ (ట్రాఫిక్), ప్రతాప్(ఏఆర్), సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.