మా ఉద్యోగులు మూన్ లైటింగ్ చేయొచ్చు

మా ఉద్యోగులు మూన్ లైటింగ్ చేయొచ్చు

ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న పదం మూన్ లైటింగ్. ఒక కంపెనీతో జాబ్ అగ్రిమెంట్ రాయించుకొని, ఆ కంపెనీకి తెలియకుండా వేరొక కంపెనీలో ఉద్యోగం చేయడాన్ని మూన్ లైటింగ్ అంటారు. చాలామంది ఐటీ ఉద్యోగులు ఈ పని చేసి ఉద్యోగాలు కూడా పోగొట్టుకున్నారు.

టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ లాంటి టెక్ దిగ్గజ కంపెనీలు మూన్ లైటింగ్ ని చాలా సీరియస్ గా తీసుకున్నాయి. కంపెనీ సెక్యూరిటీ, గైడ్ లైన్స్ కి విరుద్ధంగా మూన్ లైటింగ్ కి పాల్పడినవాళ్లందరినీ ఉద్యోగాలనుంచి తీసేశాయి. విప్రో ఒక నెలలోనే మూన్ లైటింగ్ కి పాల్పడ్డ 300 మంది ఉద్యోగులను తొలగించింది. మిగితా కంపెనీలు కూడా విప్రో బాటలోనే నడిచాయి. అయితే, టెక్ మహీంద్రా కంపెనీ సీఈఓ సీపీ గుర్నాని మాత్రం, టెక్ మహీంద్ర కంపెనీ మూన్ లైటింగ్ ని సపోర్టు చేస్తున్నట్టు ప్రకటించాడు. టెక్ మహీంద్రలో పనిచేస్తూ వేరొక కంపెనీలో పనిచేయడానికి ఒప్పుకున్నాడు. కాకపోతే మూన్ లైటింగ్ చేసే ఉద్యోగులు ఏ కంపెనీలో పనిచేస్తున్నారు, ఏం పనిచేస్తున్నారన్న విషయాలను మహీద్ర కంపెనీకి చెప్పాల్సి ఉంటుంది.