బ్లాస్టింగ్‌‌‌‌లపై సీపీ సీరియస్‌‌‌‌ : సీపీ రంగనాథ్‌‌‌‌

బ్లాస్టింగ్‌‌‌‌లపై సీపీ సీరియస్‌‌‌‌ : సీపీ రంగనాథ్‌‌‌‌

హనుమకొండ, వెలుగు : హనుమకొండ జిల్లాలో జరుగుతున్న మైనింగ్‌‌‌‌ బాంబ్‌‌‌‌ బ్లాస్టింగ్‌‌‌‌లపై సీపీ రంగనాథ్‌‌‌‌ సీరియస్‌‌‌‌ అయ్యారు. ఊళ్లకు దగ్గర్లో ఉన్న గుట్టలపై బాంబ్‌‌‌‌ బ్లాస్టింగ్‌‌‌‌లు జరుగుతుండడంతో శుక్రవారం ‘వెలుగు’ పేపర్‌‌‌‌లో పబ్లిష్‌‌‌‌ అయిన వార్తకు స్పందించిన సీపీ సంబంధిత స్టేషన్ల పరిధిలోని ఆఫీసర్లతో టెలీ కాన్ఫరెన్స్‌‌‌‌ నిర్వహించారు.

మైనింగ్‌‌‌‌ పర్మిషన్లు, బ్లాస్టింగులపై ఆరా తీసి, సాధ్యమైనంత తర్వగా రిపోర్ట్‌‌‌‌ అందించాలని ఆదేశించారు. దీంతో మైనింగ్‌‌‌‌ పర్మిషన్లతో పాటు బాంబ్‌‌‌‌ బ్లాస్టింగ్స్‌‌‌‌ చేస్తున్న వ్యక్తుల సమాచారాన్ని పోలీసులు గుట్టుగా సేకరిస్తున్నారు.

నిందితుల అరెస్ట్‌‌‌‌లో నిర్లక్ష్యం వద్దు

వరంగల్‌‌‌‌ కమిషనరేట్‌‌‌‌ పరిధిలోని వివిధ స్టేషన్లలో పెండింగ్‌‌‌‌లో ఉన్న కేసులపై శుక్రవారం కిట్స్ కాలేజీ కాన్ఫరెన్స్‌‌‌‌ హాల్‌‌‌‌లో సీపీ రంగనాథ్‌‌‌‌ రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ, అత్యాచారం, పోక్సో, ఎక్సైజ్‌‌‌‌ కేసుల  స్థితిగతులతో పాటు, నిందితుల అరెస్టుకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాల్సిన వారి వివరాలను సేకరించారు.

అనంతరం సీపీ మాట్లాడుతూ నిందితుల అరెస్ట్‌‌‌‌ విషయంలో ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. కేసు నమోదైన నెల రోజుల్లో నిందితులను అరెస్ట్‌‌‌‌ చేయాలని ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎక్సైజ్‌‌‌‌ డిప్యూటీ కమిషనర్‌‌‌‌ అంజన్‌‌‌‌రావు, డీసీపీలు కరుణాకర్, అబ్దుల్‌‌‌‌ బారీ, సీతారాం, పుష్ప పాల్గొన్నారు.