
- సీపీ సాయి చైతన్య
నవీపేట్, వెలుగు: రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీపీ సాయి చైతన్య సూచించారు. శుక్రవారం రెంజల్ మండలం కందకుర్తి వద్ద అంతర్రాష్ట్ర యంచ గోదావరి బిడ్జిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల నిజాంసాగర్ గేట్లు తెరవడంతో గోదావరి నదికి భారీ వరద వచ్చే అవకాశం ఉందని, రైతులు, పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలన్నారు.
అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100కు ఫోన్ చేయాలని, స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. బోధన్ ఏసీపీ శ్రీనివాస్, రూరల్ సీఐ విజయ్ బాబు, స్పెషల్ బ్రాంచ్ సీఐ సంతోష్ రెడ్డి, రెంజల్–నవీపేట్ ఎస్సైలు తిరుపతి, చంద్రమోహన్‌లు పాల్గొన్నారు.