
ఎడపల్లి, వెలుగు : శిక్షణార్థులకు అనుకూలంగా ఉండేలా పోలీస్ శిక్షణా కేంద్రంలో సౌకర్యాలు మెరుగుపర్చాలని సీపీ సాయి చైతన్య పోలీస్అధికారులను ఆదేశించారు. సోమవారం జానకంపేట గ్రామ సమీపంలోని జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రాన్ని సీపీ పరిశీలించి మాట్లాడారు.
పోలీస్ శిక్షణా సెంటర్ అనేది భవిష్యత్ పోలీస్ అధికారులను తీర్చిదిద్దే కేంద్రమని, శిక్షణ పొందేవారికి శారీరక, మానసిక అభివృద్ధి జరిగేలా వాతావరణం ఉండాలన్నారు. సెంటర్ పరిసరాలు, గదులు, వంటశాల, నీటి సరఫరా, టాయిలెట్స్, ఇండోర్ తరగతి గదులు, అవుట్ డోర్ పరేడ్ గ్రౌండ్, ఫైరింగ్ రేంజ్ గ్రౌండ్లను ఆయన పరిశీలించారు. సీపీ వెంట బోధన్ ఏసీపీ శ్రీనివాస్ , బోధన్ రూరల్ సీఐ విజయ్ బాబు, ఎడపల్లి ఎస్సై రమ, సిబ్బంది ఉన్నారు.