
హైదరాబాద్: ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠాను పట్టుకున్నామని తెలిపారు సీపీ సజ్జనార్. సైబరాబాద్ పరిధిలో మొత్తం 7 క్రికెట్ బెట్టింగ్ కేసులు నమోదు చేసి, 40 లక్షలు స్వాధీనం చేశామని తెలిపారు సీపీ. 8 సెల్ ఫోన్లు సీజ్ చేశామన్నారు. బెట్ 365, డ్రీమ్ 11 లాంటి పలు ఆన్ లైన్ బెట్టింగ్స్ లో యువత, స్టూడెంట్స్ ఎక్కువగా ఆడుతున్నారని తెలిపారు. బెట్టింగ్ జోలికి వెళ్లి జీవితాలను నాశనం చేసుకోకూడదని తెలిపారు సీపీ. బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకుని అప్పులపాలవుతున్నారని.. ప్రతి తల్లిదండ్రులు పిల్లల వ్యవహారంపై ఓ కన్నేయాలన్నారు. సోషల్ మీడియా వేదికగా ఎక్కువగా బెట్టింగ్స్ నడుస్తుందని.. వాట్సాప్ చాటింగ్స్ తో బాల్ టు బాల్ బెట్టింగ్ నడుస్తుందన్నారు. మ్యాచ్ కు ముందు గూగుల్ పే, ఫోన్ పే ల ద్వారా మనీ ట్రాన్సెక్షన్స్ జరుగుతున్నాయని తెలిపారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగులు కూడా బెట్టింగ్ లో పాల్గొంటున్నారని తెలిపారు.
ఈ సారి ఎక్కువగా కరోనా కష్టకాలంతో ఉద్యోగాలు పోయాయని.. డబ్బులు సంపాధించాలని అడ్డదారుల్లో ఈ బెట్టింగ్ ను ఎంచుకుంటున్నారని తెలిపారు. ఎక్కడా కూడా గుంపులుగా కనిపించడంలేదని అంతా ఆన్ లైన్ లోనే రేటింగ్ప్ , వగైరా వాట్సాప్ వాయిస్ కాల్స్ ద్వారా రేషియో నడుస్తుందన్నారు. దయచేసి ఇలాంటి వ్యసనాలకు అలవాటుపడి, రిలేషన్స్ కు దూరం కావద్దన్నారు. ఒకసారి అలవాటు పడితే.. అంతేనని.. దాన్నుంచి భయటపడి జీవితాలను చక్కదిద్దుకోవాలని సూచించారు. బెట్టింగ్స్ ద్వారా కోట్లు రావని, కష్టపడి సంపాధించుకున్నదే శాశ్వతం అన్నారు సీపీ. బెట్టింగ్ లో గెలిస్తే కమీషన్స్ పోనూ వచ్చేది తక్కువ అని, ఓడితే మొత్తం పోతుందని తెలిపారు. అనవసరంగా బెట్టింగ్ జోలికి వెళ్లి, సమయం డబ్బు, వృధా చేసుకోవడమే కాకుండా.. అనారోగ్యంపాలు కావడం ఖాయం అన్నారు. బెట్టింగ్ జోలికెళ్లి ఎంతో మంది ప్రాణాలు పోగుట్టుకున్న సంఘటనలు గతంలో వెలుగులోకి వచ్చాయని తెలిపారు. యువత డబ్బు అడుగుతున్నారంటే పూర్తి వివరాలు తెలుసుకున్నానే ఇవ్వాలని తల్లిదండ్రులకు సూచించారు సీపీ.