
హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం (ఆగస్టు 09) తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతంలో టీ వర్క్స్ సమీపంలో ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో రూపక్ త్రిపాఠి అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి (30) మృతి చెందాడు.
మృతుడు మారుతి ఎర్టీగా కారులో 'టి హబ్' వైపు వెళ్తుండగా కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తాపడింది. ఈ ప్రమాదంలో త్రిపాఠి తలకు తీవ్ర గాయాలవడంతో అతడిని మెడికవర్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఛత్తీస్‌గఢ్‌కు రాయ్‌పూర్ కు చెందిన రూపక్ త్రిపాఠి ఫెనెటిక్స్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ప్రమాద సమయం లో కారులో ఉన్న ఇతర ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. రాయ దుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.