ఉబెర్, ఓలా సహా బ్లింకిట్, జెప్టో, స్విగ్గీకి బై బై: ఇప్పుడు అన్నిటికి ఒకే యాప్..

ఉబెర్, ఓలా సహా బ్లింకిట్, జెప్టో, స్విగ్గీకి బై బై: ఇప్పుడు అన్నిటికి ఒకే యాప్..

ఆన్‌లైన్‌లో కిరాణా సామాన్ ఆర్డర్ పెట్టాల... ఎక్కడికైనా బయటికి వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేయాల.. అసలు ఏదైనా కొనాలంటే తక్కువ ధర ఎక్కడ దొరుకుతాయో తెలుసుకోవాల... ఇప్పుడు అంతా మారిపోయింది, ఏది కావాలన్న క్షణాల్లో స్మార్ట్ ఫోన్ తీసి కోనేసేయొచ్చు. కానీ ఎక్కువ ధరకు కొంటున్నామా లేక తక్కువ ధరకు కొంటున్నామా అనేది ఎలా తెలియాలి. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే ఏ పనైనా చిటికెలో చేసేయొచ్చు కానీ ఎంత  ఖర్చుతో...
        
ఇవన్నిటికి చెక్ పెడుతు ఇప్పుడు ఒక కొత్త యాప్ మార్కెట్లకి వచ్చింది. దీనితో ఏది కావాలన్నా, ఎం కొనాలన్నా బయట మార్కెట్ రేట్లు ఎలా ఉన్నాయి, ఎంత ఎక్కువ ధరకు మనం కొంటున్నాం ఇవన్నీ పోల్చి చూసి మంచి ధరకు కోనేసేయొచ్చు. దీని ద్వారా డబ్బు ఆదా అవుతుంది ఇంకా మార్కెట్లో అసలు వాటి రేట్లు ఎంత ఉన్నాయో కూడా తెలుస్తుంది.      
  
 ఈ యాప్ మీకు ఎలా సహాయపడుతుంది: మంచి విషయం ఏమిటంటే  ఏదైనా ఆర్డర్ లేదా బుక్ చేయాలంటే మీరు ఉబెర్, ఓలా, రాపిడో, బ్లింకిట్, జెప్టో,  స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ వంటి యాప్స్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. ఈ కొత్త ఆండ్రాయిడ్ యాప్ పేరు కంపారిఫై ప్రో(Comparify Pro), ఈ యాప్ మీ పనులన్ని  చాలా  ఈజీగా చేస్తుంది ఇంకా ఏదైనా తక్కువ ధరకు ఎక్కడ కొనాలో తెలుసుకోవడానికి సహాయపడుతుంది. 

మీరు క్యాబ్ ఛార్జీలు తెలుసుకోవాలనుకున్నా లేదా ఇంట్లోకి కిరాణా సామాగ్రి ధరలను తెలుసుకోవాలనుకున్నా Comparify Proని ఉపయోగించుకోవచ్చు.  ఈ యాప్ Uber, Ola, Rapido, Blinkit, Zepto, Swiggy Instamart వంటి యాప్‌ల రియల్-టైమ్ ధరలను చూపిస్తుంది. ఇంకా మీరు దేంట్లో తక్కువ ధర ఉంటే దానిని సెలెక్ట్ చేసుకోవచ్చు. 

ప్రతిసారీ యాప్స్ మార్చకుండ కిరాణా షాపింగ్, క్యాబ్ బుకింగ్ బెస్ట్ అప్షన్స్ సలెక్ట్ చేసుకోవడంలో సహాయపడుతుంది. అది కూడా మీ మొబైల్‌లో ఆఫర్, మీ వాలెట్ బ్యాలెన్స్‌ ఆధారంగా అసలు ధరలను చూపుతుంది.

కంపారిఫై ప్రో యాప్ వల్ల ప్రయోజనాలు: ఉబెర్, ఓలా, రాపిడో వంటి క్యాబ్ యాప్స్ అయినా లేదా బ్లింకిట్, జెప్టో, కంపారిఫై ప్రో వంటి క్విక్-కామర్స్ సేవలు అయినా అన్నింటి ధరలను ఒకే చోట చూపిస్తాయి. దీని వల్ల మీ టైం వృధా కాకుండా  ఉంటుంది.