
మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఇప్పుడు ఒక కొత్త ప్రత్యేకమైన ఫీచర్‌పై పనిచేస్తోంది, దింతో మీరు వాట్సాప్ ఇన్‌స్టాల్ చేయని వారితో లేదా వాట్సాప్ అకౌంట్ లేని వారితో కూడా చాట్ చేయవచ్చు.
ఈ కొత్త ఫీచర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.25.22.13లో టెస్టింగ్ చేస్తున్నారు. వాట్సాప్ కొత్త 'గెస్ట్ మోడ్' ఫీచర్ సహాయంతో మీరు ఇప్పుడు వాట్సాప్ యాప్ లేదా అకౌంట్ లేని వారితో మాట్లాడొచ్చు. ఇందుకోసం ఒక ఇన్విటేషన్ లింక్ పంపి డైరెక్ట్ చాట్ చేయవచ్చు.
ఈ ఫీచర్ గురించి వాట్సాప్ మాట్లాడుతూ ఈ చాటింగ్ ఫీచర్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో ఉంటుందని చెప్పింది. అంటే, ఏ థర్డ్ పార్టీ కూడా ఇద్దరి మధ్య జరిగే చాట్‌ను చదవలేదు.
ఈ ఫీచర్ చాలా ఉపయోగంగా ఉన్నాగాని దీనికి కొన్ని పరిమితులు ఉన్నాయి. గెస్ట్ మోడ్ యూజర్లు ఎలాంటి ఫోటో లేదా GIFలను షేర్ చేయలేరు. అలాగే ఈ ఫీచర్‌లో వాయిస్ & వీడియో కాల్స్ ఉండవు. ఈ ఫీచర్ వన్-ఆన్-వన్ చాటింగ్‌కు మాత్రమే అంటే గ్రూప్ చాట్ చేయలేరు.
ఈ ఫీచర్ ఎప్పుడు వస్తుంది అనే దానిపై ఎటువంటి సమాచారం లేదు, కానీ త్వరలో బీటా యూజర్లకు అందుబాటులోకి రావచ్చని భావిస్తున్నారు. దీని తర్వాత పబ్లిక్ యూజర్లు కూడా తీసుకొస్తారని చెబుతున్నారు. వాట్సాప్ ఈ ఫీచర్ తీసుకురావడం ద్వారా వాట్సాప్ వాడే ప్రజల ఇంకా పెరుగుతుందని స్పష్టంగా తెలుస్తుంది.