2027 ODI World Cup: బీసీసీఐ స్ట్రిక్ట్ రూల్.. ఆ కండీషన్‌కు ఓకే అంటేనే వరల్డ్ కప్‌కు రోహిత్, కోహ్లీ

2027 ODI World Cup: బీసీసీఐ స్ట్రిక్ట్ రూల్.. ఆ కండీషన్‌కు ఓకే అంటేనే వరల్డ్ కప్‌కు రోహిత్, కోహ్లీ

టీమిండియా స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్డే భవిష్యత్ డైలమాలో పడింది. వీరిద్దరూ టార్గెట్ చేసిన 2027 వన్డే ప్రపంచ కప్ ఆడే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. సీనియర్ ప్లేయర్లు అయినప్పటికీ వీరు వన్డే వరల్డ్ కప్ వరకు జట్టులో కొనసాగడం కష్టమని బీసీసీఐ చెప్పనట్టు సమాచారం. తాజా నివేదికల ప్రకారం ఈ సీనియర్ ప్లేయర్స్ వరల్డ్ కప్ ప్రణాళికలో లేరు. అక్టోబర్ లో ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే సిరీస్ వారి కెరీర్ లో చివరిదైనా ఆశ్చర్యం లేదని ఎక్స్ పర్ట్స్ భావిస్తున్నారు. భారత జట్టు కొత్త శకానికి సిద్ధమవుతోందని, వన్డేల్లో యువ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు లభించే అవకాశం ఉందని రిపోర్ట్స్ చెబుతున్నాయి. 

వరల్డ్ కప్ కు మరో రెండున్నరేళ్ల సమయం ఉంది. ప్రస్తుతం రోహిత్, కోహ్లీ వన్డే ఫార్మాట్ మాత్రమే ఆడడంతో వారి ఫామ్ ఆందోళన కలిగిస్తుంది. వీరిద్దరూ ఆ సమయానికి ఫిట్ నెస్ తో పాటు ఫామ్ లో ఉంటారంటే ఖచ్చితంగా చెప్పాలని పరిస్థితి. టెస్ట్ క్రికెట్ లో పేలవ ఫామ్ కారణంగానే ఈ ఇద్దరూ సుదీర్ఘ ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఒక్క ఫార్మాట్ ఆడడంతో వీరి ఫామ్ ప్రస్నార్ధకంగా మారింది. బీసీసీఐ కూడా రోహిత్, కోహ్లీ జోడీ ఖచ్చితంగా జట్టులో ఉంటారనే గ్యారంటీ ఇవ్వలేకపోతుంది. ఈ ఇద్దరు దిగ్గజ క్రికెటర్లు లేకపోయినా ఇటీవలే ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ ను టీమిండియా అద్భుతంగా ఆడి 2-2 తో సమం చేసుకుంది.

రోహిత్, విరాట్ జట్టులో తమ స్థానాలను నిలుపుకోవాలనుకుంటే ఒకటే దారి కనిపిస్తోంది. వీరిద్దరూ దేశవాళీ క్రికెట్ లో వన్డే ఫార్మాట్ లో  జరగబోయే విజయ్ హజారే ట్రోఫీలో ఖచ్చితంగా ఆడి వారి ఫామ్ ఫిట్ నెస్ ను నిరూపించుకోవాల్సి ఉంది. ఇలా జరిగితేనే వీరు రానున్న రెండేళ్లపాటు జట్టులో కొనసాగనున్నారు. 2027 వన్డే వరల్డ్ కప్ సమయానికి రోహిత్ వయసు 40 సంవత్సరాలు. మరోవైపు కోహ్లీకి 38 ఏళ్ళు నిండుతాయి. ప్రస్తుతం ఒకటే ఫార్మాట్ ఆడుతున్న వీరిద్దరూ ఫిట్ నెస్, ఫామ్ ఎలా ఉందొ తెలియకుండా డైరెక్ట్ గా 2027 వన్డే వరల్డ్ కప్ ఆడడానికి బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇవ్వట్లేదు. దేశవాళీ క్రికెట్ లో నిరూపించుకుంటేనే వారు వన్డేలో కొనసాగనున్నారు.