ధనుష్ తో డేటింగ్ పై మృణాల్ క్లారిటీ.. ఇద్దరి అనుబంధంపై ఆసక్తికర వ్యాఖ్యలు!

ధనుష్ తో డేటింగ్ పై మృణాల్ క్లారిటీ.. ఇద్దరి అనుబంధంపై ఆసక్తికర వ్యాఖ్యలు!

సినీ ఇండస్ట్రీలో రూమర్స్, గాసిప్స్ చాలా సహజం. ముఖ్యంగా హీరో , హీరోయిన్లు ఏదైనా పార్టీలో కలిసినా, ఒకరి సినిమా ప్రమోషన్స్ కు మరొకరు హాజరైనా వెంటనే పుకార్లు గుప్పుమంటాయి పుట్టుకొస్తుంటాయి. కొన్నిసార్లు ఆ పుకార్లు నిజం కాగా.. మరికొన్నిసార్లు అవి కేవలం పబ్లిసిటీ కోసమే అని తేలిపోతుంటాయి. అంటి వార్త ఇప్పుడు తమిళ హీరో ధనుష్, మృణాల్ ఠాకూర్ విషయంలోనూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

నటుడు ధనుష్ తో  నటి మృణాల్ డేటింగ్ చేస్తుందంటూ పుకార్లు షికారు చేస్తున్నారు.  మరీ ముఖ్యంగా అజయ్ దేవగన్, మృణాల్ కలిసి నటించిన 'సన్ ఆఫ్ సర్దార్ 2' మూవీ లాంచ్ ఈవెంట్ కు ధనుస్ ప్రత్యేక అతిథిగా హాజరవడం ఈ రూమర్స్ కు మరింత అజ్యం పోసింది. ఈ వేడుకలో ధనుష్, మృణాల్ ప్రత్యేకంగా మాట్లాడుకోవడంతో వీరిద్దరి మధ్య ఎదో ఉందని అనుకోవడం మొదలుపెట్టారు అభిమానులు.  

అంతే కాకుండా మృణాల్ పుట్టినరోజు వేడుకకు కూడా ధనుష్ హాజరయ్యారు. ఇలా వీరిద్దరూ పలు వేదికల్లో కనిపించడం వీరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ అంటూ వస్తున్న పూకార్లకు మరింత బలం చేకూర్చింది. ఐశ్వర్యతో విడాకుల తర్వాత మృణాల్ తో డేటింగ్ చేస్తున్నారంటూ బాలీవుడ్ మీడియలోనూ పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. 

అయితే వీరిద్దరి రిలేషన్ పిష్ పై వస్తున్న వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టింది మృణాల్.  ఇటీవల ఓ ఇంటర్యూలో ఈ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చింది. ధనుష్ తనకు మంచి స్నేహితుడు మాత్రమేనని స్పష్టం చేసింది. ఇలాంటి వార్తలు, గాసిప్స్ చూసి చాలా నవ్వుకున్నానని చెప్పింది. సన్ ఆఫ్ సర్దార్ 2 ఈవెంట్ కు ధనుష్ రావడంపై అభిమానులు తప్పుగా అర్ధం చేసుకున్నారు. నిజానికి అజయ్ దేవగన్ , ధనుష్ మంచి స్నేహిడులు. ఆ ఈవెంట్ కు అజయ్ ఆహ్వానం మేరకు ధనుష్ వచ్చారు. అంతే తప్ప మా మధ్య ఏదో ఉందని తప్పుగా అనుకోనుకోవడం సరికాదు అని క్లారిటీ ఇచ్చారు మృణాల్. 

ఈ రూమర్స్ పై మృణాల్ ఠాకూర్ స్పష్టత ఇచ్చినా అభిమానులు మాత్రం వీరిద్దరూ కలిసి నటిస్తే చూడాలని ఆశపడుతున్నారు. మరి వీరి స్నేహం కాస్త భవిష్యత్తులో ఒక సినిమాకు దారితీస్తుందో లేదో అనేది కాలమే నిర్ణయిస్తుంది.