
పేగు తెంచుకు పుట్టక పోయినా ఒకే రక్తం ఉంది వాళ్లలో. ఒకే తల్లి కడుపున పుట్టకపోయినా అన్నా చెల్లెళ్ల బంధం వాళ్లది. ఒకే మతం కాకపోయినా మత సామరస్యానికి ఉదాహరణ వాళ్లు. ఒక ముస్లిం కమ్యూనిటీలో పుట్టినప్పటికీ.. హిందూ అబ్బాయికి రాఖీ కడుతూ.. అన్నా చెల్లెళ్ల బంధం కులాలు, మతాలకు అతీతం అని నిరూపించారు. మతం కోసం కొట్టుకు చచ్చే ఈ రోజుల్లో మానవత్వానికి ఉన్న బలమేంటో చెప్తోంది ముంబై కి చెందిన అన్మతా అహ్మద్, శివం మిస్త్రీ ల స్టోరీ.
గుజరాత్ కు చెందిన శివం మిస్త్రీ.. ముంబైకి చెందిన అన్మతా అహ్మద్.. చనిపోయిన రియా కలిపిన అన్నా చెల్లెళ్లు. నేను లేకపోయినా.. నీకు మరో చెల్లిని అప్పగించి వెళ్తున్నా అన్నట్లుగా రియా తన అన్న శివంకు అన్మతా అహ్మద్ ను ఇచ్చి వెళ్లింది. అన్మతాలో తన చెల్లి రియాను చూసుకుంటూ.. రాఖీ కడుతుంటే.. తన చెల్లే వచ్చి కడుతున్నట్లుగా ఉందని భావోద్వేగానికి గురయ్యాడు శివం. అన్నా చెల్లెళ్ల బంధానికి మరో కొత్త నిర్వచనం చెప్పిన వీళ్ల బంధం గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
చెయ్యి ట్రాన్ప్లాంటేషన్ తో కలిసిన బంధం:
ముంబై గోరెగాన్ కు చెందిన అన్మతా అహ్మద్ అనే 15 ఏళ్ల అమ్మాయి.. 2022 అక్టోబర్ 30న చేయి కోల్పోయింది. ఉత్తరప్రదేశ్ అలీఘర్ లోని బంధువుల ఇంటికి వెళ్లినపుడు 11 వేల కిలోవాట్ల హైపవర్ కేబుల్ తగలటంతో కుడి చేయి పూర్తిగా డ్యామేజ్ అయ్యింది. చెయ్యి తీసెయ్యడంతో రెండేళ్లు ఫిజికల్ గా, మెంటల్ గా చాలా ఇబ్బందులకు గురయ్యింది.
రెండేళ్ల తర్వాత ఓ 200 కిలోమీటర్ల దూరంలో గుజరాత్ వల్సద్ కు చెందిన రియా అనే అమ్మాయి కారణంగా అన్మతాకు కొత్త చేయి వచ్చింది. వల్సద్ కు చెందిన రియా అనే అమ్మాయి కొంతకాలం కింద అనారోగ్యానికి గురైంది. వామ్టింగ్, తలనొప్పి కారణంగా చాలా ఆస్పత్రులు తిరిగినప్పటికీ ఆ అమ్మాయి ప్రాణాలు పేరెంట్స్ కు దక్కలేదు. సూరత్ లోని కిరణ్ ఆస్పత్రిలో రక్తస్రావంతో తుదిశ్వాస విడిచింది ఆ చిన్నారి. అయితే ఆమె అవయవాలు ఇతరులకు పనిచేస్తాయని గుర్తించిన డాక్టర్లు చెప్పిన సలహాతో.. ఆర్గాన్స్ డొనేషన్ కు ముందుకు వచ్చారు. దీంతో రియా కుడి చేతిని అన్మతా అహ్మద్ కు డొనేట్ చేయడంతో ఆమెకు కొత్త చేయి వచ్చింది.
Beautiful Raksha Bandhan story of love, loss, and hope. A Muslim girl had tragically lost her hand. Last year, she received Riya's hand through a transplant.
— Shuja Ali (@shujaali110) August 9, 2025
Today, she tied Rakhi to Riya’s brother. #LifeIsBeautiful #OrganDonation #Miracles #RespectDoctors #Humanity pic.twitter.com/P4KFCn28IK
రియా చేయి తనలో ఉందని భావించిన అన్మతా.. రియా ఫ్యామిలీకి దగ్గరైంది. రియా చెయ్యిని అన్మతా లో చూసుకుంటున్న రియా కుటుంబ సభ్యులు అన్మతాను తమ కూతురులా చూసుకుంటున్నారు.
రియా బతికి వచ్చినంత ఆనందం:
అన్మతా అహ్మద్.. రాఖీ పండుగ సందర్భంగా.. చనిపోయిన రియా ఇంటికి వచ్చి ఆమె అన్న శివం మిస్త్రీకి రాఖీ కట్టింది. తన చెల్లి వచ్చి రాఖీ కట్టినట్లుగా ఉందని శివం ఆనందం వ్యక్తం చేశాడు. అన్మతా వచ్చి శివం చేతికి రాఖీ కడుతున్నప్పుడు.. మా కూతురు రియా వచ్చి కట్టినట్లు అనిపించిందని శివం తల్లి త్రిషా ఆనందం వ్యక్తం చేసింది. రియా మళ్లీ మా లైఫ్ లోకి వచ్చినట్లు అనిపించింది. ఈ సందర్భంగా రియాకు ఇష్టమైన గులాబ్ జాం రెడీ చేసి అందరం పంచుకున్నాం.. ప్రతీ ఏడాది ఇలాగే రాఖీ పండుగ జరుపుకుంటాం.. ఇవాళ రియా మా మధ్యన ఉన్నట్లుగానే సంతోషంగా గడిపాం.. అంటూ రియా తల్లి త్రిషా మిస్త్రీ భావోద్వేగానికి గురైంది. మా కూతురు చనిపోయాక మళ్లీ ఆమెను తీసుకురాలేం. కానీ మా లైఫ్ లోకి అన్మతా వచ్చిన తర్వాత తమ కూతురే వచ్చినట్లు సంతోషంగా ఉందని ఆమె తెలిపింది.
నాకు అన్నా తమ్ముళ్లు లేరు. శివం మిస్త్రీ తన అక్కను కోల్పోయాడు. అప్పట్నుంచి మేము అన్నా చెల్లెళ్లు అయిపోయాం. నేను అతడికి చెల్లిని.. అతడు నాకు అన్న.. ప్రతీ ఏటా నేను రాఖీ కడతా.. దూరం వ్యక్తులను కలిసినట్లు అనిపించదు. అలా ఆ కుటుంబంతో బంధం పెనవేసుకుంది.. అని రాఖీ కట్టిన సందర్భంగా చెప్పింది అన్మతా అహ్మద్.
రియా చనిపోయాక.. ఆర్గాన్ డొనేషన్ చేస్తే రియా మళ్లీ బతికినట్లుగా ఉంటుందని.. చాలా మందిలో రియాను చూసుకోవచ్చునని గైనకాలజిస్ట్ డా. మస్త్రీ.. రియా పేరెంట్స్ అయిన త్రిషా, బాబీని ఒప్పించారు. పేరెంట్స్ ఒప్పుకోవడంతో రియాకు సంబంధించిన రెండు కిడ్నీలు, లివర్, ఊపిరితిత్తులు, ఒక చేతి, పేగులు ఇతరులకు ట్రాన్స్ ప్లాంట్ చేశారు. రియా కుడి చేయి కూడా ముంబై గ్లోబల్ హాస్పిటల్ లో అన్మతా అహ్మద్ కు ట్రాన్స్ ప్లాంట్ సర్జరీ ద్వారా అతికించారు. భుజం లెవల్ లో చేయిన ట్రాన్స్ ప్లాంట్ చేసిన అతిచిన్న వ్యక్తిగా అన్మతా నిలిచింది.
శనివారం (ఆగస్టు 09) అన్మతా అహ్మద్.. శివం కు రాఖీ కట్టేందుకు వందల కిలోమీటర్లు ప్రయాణించి గుజరాత్ వల్సద్ పట్ణణం చేరుకుంది. అక్కడ రియా కుటుంబ సభ్యులను కలిసి.. శివంకు రాఖీ కట్టింది. ఇరు కుటుంబాలు తితాల్ బీచ్ లో సరదాగా గడిపాయి. ఎంతో ఎమోషనల్ గా సాగింది వీళ్ల కలయిక. అన్మతా వెళ్లగానే తన కూతురు కళ్లముందుకు వచ్చినట్లుగా అన్మతాను గట్టిగా కౌగిలించుకుంది రియా తల్లి త్రిషా. చేయి మాత్రమే రియాది అయినప్పటికీ.. అన్మతా తన కూతురులాగే అనిపిస్తోందని భావోద్వేగానికి గురైంది. అన్మతా రాఖీ కడితే.. నా చెల్లి రియా కట్టినట్లుగా ఉందని శివం తన సంతోషాన్ని పంచుకున్నాడు.