సంచలనాల సజ్జనార్... హైదరాబాద్ సీపీగా 13 నెలలు...ఆహార కల్తీ, డ్రగ్స్‌‌‌‌‌‌‌‌ పై ఉక్కుపాదం

సంచలనాల సజ్జనార్... హైదరాబాద్ సీపీగా 13 నెలలు...ఆహార కల్తీ, డ్రగ్స్‌‌‌‌‌‌‌‌ పై ఉక్కుపాదం
  • ఫైర్​, డిజాస్టర్​ ఎమర్జెన్సీ సివిల్​ డిఫెన్స్​ రెస్పాన్స్ ​శాఖకు బదిలీ 
  • సరికొత్త ప్రజా పోలీసింగ్‌‌‌‌‌‌‌‌ తో మన్ననలు పొందిన ఆఫీసర్​ 

హైదరాబాద్ సిటీ, వెలుగు : సంచలనాలకు, సరికొత్త ప్రజా పోలీసింగ్​కు మారు పేరుగా నిలిచిన సంచలనాల సజ్జనార్ ​హైదరాబాద్ సీపీగా 13 నెలల పాటు పని చేసి తనదైన ముద్ర వేశారు. బదిలీల్లో భాగంగా తెలంగాణ ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్ (డీజీపీ)గా వెళ్తున్న ఆయన హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ సీపీగా సెప్టెంబర్ 30, 2025న బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో నగరంలో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు..సామాజికాంశాలపై ఆయన చూపిన చొరవతో ప్రజల మన్ననలు పొందారు. 

డ్రగ్స్ రహిత నగరంగా మార్చేందుకు..

తన పదవీకాలంలో సజ్జనార్ నగర ప్రజలను తీవ్రంగా వేధిస్తున్న సమస్యలపై దృష్టి సారించారు. ముఖ్యంగా హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార కల్తీలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి కఠిన చర్యలు తీసుకున్నారు.  నగరాన్ని డ్రగ్స్ రహితంగా మార్చే లక్ష్యంతో హెచ్‌‌‌‌‌‌‌‌-న్యూ విభాగాన్ని పటిష్టం చేశారు. పబ్‌‌‌‌‌‌‌‌లు, విద్యాసంస్థలపై నిఘా పెంచి డ్రగ్స్ ముఠాలను సమర్థవంతంగా అరికట్టడంలో కీలక పాత్ర పోషించారు.  

రోడ్డు భద్రత కోసం ‘సేఫ్‌‌‌‌‌‌‌‌ రైడ్‌‌‌‌‌‌‌‌ ఛాలెంజ్’ వంటి వినూత్న సోషల్ మీడియా ప్రచారాలను ప్రారంభించి వాహనదారుల్లో చైతన్యం తెచ్చారు.బాధితులకు సత్వర న్యాయం చేకూర్చేలా ఇన్వెస్టిగేటింగ్​ మానిటరింగ్​ సెల్​ ప్రారంభించి సక్సెస్​ అయ్యారు. ముఖ్యంగా కేబీఆర్​ చుట్టూ వన్​వేను ఛాలెంజింగ్​గా తీసుకుని విజయవంతంగా అమలు చేశారు. 

మీట్ యువర్ సీపీ పేరుతో చైతన్యం

కేవలం శాంతి భద్రతలకే పరిమితం కాకుండా ప్రజలకు, పోలీసు శాఖకు మధ్య ఉన్న దూరాన్ని చెరిపేసేందుకు ఆయన విప్లవాత్మక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. బాధితులు నేరుగా కమిషనర్‌‌‌‌‌‌‌‌ను కలిసేందుకు ‘మీట్ యువర్ సీపీ’, ప్రభుత్వ స్కూల్స్ విద్యార్థుల్లో చైతన్యం కోసం ‘ఏ డే విత్ సీపీ’ వంటి ప్రోగ్రాంలను విజయవంతంగా నిర్వహించారు.  ఏ డే విత్ సీపీలో భాగంగా ప్రభుత్వ స్కూల్స్ విద్యార్థుల్లో (8 నుంచి 10వ తరగతి) పోలీసు వ్యవస్థపై అవగాహన పెంచేందుకు, వారిని బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దేందుకు 45 రోజుల పాటు ప్రత్యేక ప్రోగ్రాం నిర్వహించారు. 

రోజుకు 20 మంది విద్యార్థులను ఎంపిక చేసి పోలీసుల పనితీరును ఫీల్డ్​లెవెల్​లో ప్రత్యక్షంగా చూపించారు. సైబర్ నేరాల కట్టడికి  ‘ఆపరేషన్ ఆక్టోపస్ 3.0’, ‘సైబర్ సింబా’ పేరిట ప్రత్యేక అవగాహన డ్రైవ్‌‌‌‌‌‌‌‌లు చేపట్టి ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ మోసాల బారిన పడకుండా అప్రమత్తం చేశారు.  పాలనాపరమైన సామర్థ్యాన్ని పెంచేందుకు, అవినీతికి తావులేకుండా ఉండేందుకు ఒకేసారి 75 మంది సబ్-ఇన్‌‌‌‌‌‌‌‌స్పెక్టర్లను (ఎస్సైలను) బదిలీ చేసి పోలీస్ వ్యవస్థలో కదలిక తెచ్చారు. ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ బెట్టింగ్ యాప్స్‌‌‌‌‌‌‌‌ను ప్రమోట్ చేసే వారిపై, నిర్వాహకులపై సీరియస్​ యాక్షన్ ​తీసుకున్నారు.  

1,446  సిబ్బందికి  ఎక్స్ ట్రా మైల్ అవార్డు 

పోలీస్ శాఖలో పని చేస్తున్న సిబ్బంది సంక్షేమం, వారి మానసికోల్లాసం కోసం సజ్జనార్ తీసుకున్న చర్యలు  ప్రశంసలందుకున్నాయి. విధి నిర్వహణలో అంకితభావం కనబరిచిన 1,446 మంది సిబ్బందికి ఒకేసారి ‘ఎక్స్‌‌‌‌‌‌‌‌ట్రా మైల్’ అవార్డులను అందజేసి ప్రోత్సహించారు. పోలీస్ స్టేషన్లలో ప్రక్షాళన చర్యలు చేపట్టడంతో పాటు సిబ్బందిని ఒత్తిడి నుంచి దూరం చేసేందుకు బుక్​రీడింగ్​, యోగా వంటి అలవాట్లను పెంపొందించుకోవాలని సూచించారు. 

జనాలకు ఆపదను తెచ్చే ఏ విషయాన్నయిన తన సోషల్​మీడియా గ్రూపులో పోస్ట్​చేసి అలర్ట్​చేసేవారు. హైదరాబాద్​పోలీస్​కమిషనర్ అయినా నిత్యం ఫీల్డ్​లోనే ఉంటూ సామాన్యులతో కలిసి పోయేవారు. అన్ని విషయాల్లో తనదైన ముద్ర వేసిన ఆయన, ఇప్పుడు డీజీపీగా నూతన బాధ్యతలను స్వీకరించి సరికొత్త రికార్డుల దిశగా అడుగులు వేయబోతున్నారు.