బషీర్‌బాగ్, వెలుగు: సిరిసిల్ల జిల్లాలో ఇటీవల ఆర్టీసీ డ్రైవర్‌పై జరిగిన దాడిని హైదరాబాద్ సీపీ సజ్జనార్ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి దాడులకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని తన ఎక్స్ ఖాతాలో స్పష్టం చేశారు. పోలీస్ అధికారులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ సిబ్బంది తదితర ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులపై దాడులు చేస్తే నిందితులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. అవసరమైతే హిస్టరీ షీట్లు తెరుస్తామన్నారు. క్షణికావేశంలో చేసే చిన్న పొరపాటు జీవితాంతం బాధ కలిగించేలా మారుతుందని ప్రజలను అప్రమత్తం చేశారు.
