తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమిట్కు భారీ బందోబస్తు : సీపీ సుధీర్ బాబు

తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమిట్కు భారీ బందోబస్తు : సీపీ సుధీర్ బాబు

మల్కాజిగిరి, వెలుగు: మహేశ్వరం జోన్​లోని మీర్ఖాన్ పేటలో డిసెంబర్ 8, 9 తేదీల్లో జరిగే తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమిట్​కు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. శుక్రవారం ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ బందోబస్తును శుక్రవారం ఆయన దగ్గరుండి పర్యవేక్షించారు. 

ఇతర ఉన్నతాధికారులతో కలిసి పార్కింగ్ స్థలం, హెలిపాడ్ ప్రదేశం, మీటింగ్ ప్రదేశం, రోడ్ మ్యాప్ ను పరిశీలించారు. సీపీ వెంట డీసీపీ మహేశ్వరం సునీతా రెడ్డి, ఇబ్రహీంపట్నం ఏసీపీ తదితరులు ఉన్నారు.