నేడు సీపీగెట్ ఫలితాలు.. మధ్యాహ్నం 3.30 గంటలకు విడుదల

నేడు సీపీగెట్ ఫలితాలు.. మధ్యాహ్నం 3.30 గంటలకు విడుదల

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్ (సీపీగెట్) ఫలితాలను సోమవారం రిలీజ్ చేయనున్నట్టు సీపీగెట్ కన్వీనర్ పాండు రంగారెడ్డి తెలిపారు. హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫీసులో మధ్యాహ్నం 3.30 గంటలకు కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, ఓయూ వీసీ కుమార్ రిలీజ్ చేస్తారని చెప్పారు. ఆగస్టు 4 నుంచి 11 వరకు ఆర్ట్స్, సైన్స్, సోషల్ సైన్స్, కామర్స్, ఎడ్యుకేషన్ విభాగాల్లో 40 సబ్జెక్టులు, 4.. ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్​లైన్​లో ఎగ్జామ్స్ జరిగాయి. ఈ పరీక్షలకు 62,806 మంది దరఖాస్తు చేసుకోగా,  54,695 మంది అటెండ్ అయ్యారు.