బహిరంగంగా రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుంది: నారాయణ

బహిరంగంగా రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుంది: నారాయణ

ఢిల్లీ:  ఒక జాతీయ పార్టీని ప్రాంతీయ పార్టీలోనికి విలీనం చేసుకోవడం అనైతికమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. తెలంగాణలో రాష్ట్రంలో  బహిరంగంగా రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుందని ఆయన ఉన్నారు.  టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడంపై కేంద్ర ప్రభుత్వంతో పాటు ఎన్నికల కమిషన్ కూడా  జోక్యం చేసుకోవాలన్నారు.

రాష్ట్రంలో ఇలాంటి ఘోరాలు జరుగుతుంటే గవర్నర్ కళ్లారా చూస్తుండిపోయారన్నారు. రాజ్యాంగపరంగా అడగాల్సిన హక్కు లేకపోయినా.. కనీసం పెద్ద హోదాలో అయినా అడగడం లేదని గవర్నర్ నరసింహన్ ను నారాయణ విమర్శించారు.

గతంలో రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులను పార్టీలో కాంగ్రెస్ లో చేర్చుకున్నారని నారాయణ గుర్తు చేశారు. శాసనసభలో ప్రతిపక్షం లేకుండా చేస్తే ఆ తర్వాత ప్రజలే ప్రతిపక్ష నాయకులు అవుతారన్నారు.గతంలో చంద్రబాబు నాయుడుకు ఏ పరిస్థితి ఎదురైందో అదే పరిస్థితి కేసీఆర్ ఎదురవుతుందని  నారాయణ ఈ సందర్భంగా హెచ్చరించారు.