గ్రేటర్ వరంగల్, వెలుగు: గత పదేండ్లతో పోల్చుకుంటే దేశంలో ప్రధాని మోదీ క్రేజ్రోజు రోజుకు సన్నగిల్లిపోతుందని, ఇందుకు ఆయన అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలే కారణమని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ విమర్శించారు. శుక్రవారం హనుమ కొండలో నిర్వహించిన సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సమావేశానికి నారాయణ ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. ‘‘పశ్చిమ బెంగాల్లో జూనియర్ డాక్టర్ అత్యాచారం, హత్య ఘటనలో సీఎం మమతా బెనర్జీనే దోషిగా చూస్తాం.
ఈ ఘటనపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ జరపడం మంచి నిర్ణయం. దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెరుతున్నాయి. పౌర హక్కులకు న్యాయం చేయాల్సిన మోదీ.. అదానీ , అంబానీ చేతుల్లో కీలుబొమ్మగా మారారు. దేశంలో సాగుతున్న పాలనను బీజేపీ ప్రభుత్వానిది అనడం కంటే.. చంద్రబాబు, నితీశ్ కుమార్ పాలనగా ప్రజలు చూస్తున్నరు’’ అని పేర్కొన్నారు.