Medical Technology:SS ఇన్నోవేషన్స్ మారథాన్‌.. హైదరాబాద్లో 100 రోబో టెలిసర్జరీలు విజయవంతం

Medical Technology:SS ఇన్నోవేషన్స్  మారథాన్‌.. హైదరాబాద్లో 100 రోబో టెలిసర్జరీలు విజయవంతం

హైదరాబాద్​, వెలుగు: ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ ఇన్నోవేషన్స్ ఇంటర్నేషనల్ సంస్థ ఎస్ఎస్ఐఐ మంత్ర ద్వారా 100 రోబోటిక్ టెలి సర్జరీలను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ మైలురాయిని సాధించిన సందర్భంగా మనదేశంలోనే మొదటిసారిగా రోబోటిక్  టెలిసర్జరీ మారథాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిర్వహించింది. 

ఒకే రోజులో 20 కన్నా ఎక్కువ రోబోటిక్ సర్జరీలు చేసి సత్తా చాటామని ప్రకటించింది. ఈ అధునాతన వ్యవస్థ ద్వారా మారుమూల ప్రాంతాలకు కూడా నిపుణులైన వైద్య సేవలను అందించవచ్చని సంస్థ వ్యవస్థాపకుడు,  సీఈఓ డాక్టర్ సుధీర్ శ్రీవాస్తవ అన్నారు. దేశవ్యాప్తంగా సురక్షితమైన, నమ్మదగిన మెడికల్ ​టెక్నాలజీలను అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.