సీఎంకు చిత్తశుద్ది ఉంటే పేదలకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలి..

సీఎంకు చిత్తశుద్ది ఉంటే పేదలకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలి..

ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకున్న పేదలకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు సీపీఐ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ. ఇవాళ హన్మకొండలోని బాలసముద్రం ఏకాశిలా పార్క్ వద్ద సీపీఐ ఆధ్వర్యంలో భారీ ధర్నా చేపట్టారు. ఈ ధర్నలో, రాష్ట్ర, జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొన్నారు. ఈ ధర్నలో గుడిసె వాసులు భారీగా తరలి వచ్చి తమ నిరసన వ్యక్తం చేశారు. భూ పోరాటాలు వర్ధిలాలి అంటూ నినాదాలు చేశారు. కలెక్టరేట్ ముట్టడికి వెల్లుతుండగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఏకశిలా పార్క్ జంక్షన్ వద్ద భారీగా పోలీసులు మొహరించారు. ఈ క్రమంలో సీపీఐ నేతలు గుడిసె వాసులతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. 

ఈ సందర్భంగా సీపీఐ నారాయణ మీడియాతో మాట్లాడుతూ: ఇల్లు లేని నిరుపేదలకు ఇండ్ల స్థలాలు కావాలని న్యాయబద్దంగా పోరాడుతున్నం.పేద ప్రజల ఆత్మగౌరవం కోసం సీపీఐ పోరాడుతోంది అన్నారు. ప్రభుత్వంతో చావో,రేవో తేల్చుకుంటాం అని నారాయణ తెలిపారు. ఉంటే గుడిసెలో లేకుంటే జైల్లో ఉంటాను. పోలీసులను అడ్డుపెట్టి పేదలపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. సమస్యలు పరిష్కారం కాకపోతే, తుపాకులు చేతపడుతామని నారాయణ హెచ్చరించారు.సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజల బాగోగులు చూడడం చేతకాక,జాతీయ రాజకీయాలంటూ ఢిల్లీకి పోతున్నాడని విమర్శించారు.

సీఎంకు చిత్తశుద్ది ఉంటే వరంగల్ లో పేదలకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలని వ్యాఖ్యానించారు.పేదలకు అండగా ఉండల్సిన ప్రభుత్వం ల్యాండ్ మాఫియాతో చేతులు కలుపుతోందని ఆరోపించారు.ప్రభుత్వం ల్యాండ్ మాఫియాకు సహకరిస్తే, మాతో యుద్దానికి సిద్దంగా ఉండాలి హెచ్చరించారు.ప్రభుత్వ భూములను కాపాడడానికి వస్తే మాపై దాడులు చేస్తారా.. వరంగల్ పోరుగడ్డ, భూ పోరాటాలకు ఇక్కడే నాంది పలుకుతాం. జక్కలోద్దిలో పేదల ఇండ్లను కాల్చడం దారుణం అని నారాయణ మండిపడ్డారు.