న్యాయవిచారణ పరిధిలోకి సింగరేణిని చేర్చాలి: రేవంత్ రెడ్డికి సీపీఐ విజ్ఞప్తి

న్యాయవిచారణ పరిధిలోకి  సింగరేణిని చేర్చాలి: రేవంత్ రెడ్డికి సీపీఐ విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: సింగరేణి కాలరీస్ లో జరిగిన అక్రమాలు, అవినీతిని న్యాయవిచారణ పరిధిలోకి తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డికి సీపీఐ ప్రతినిధి బృందం విజ్ఞప్తి చేసింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆధ్వర్యంలో మంగళవారం ఈ బృందం సీఎంను మర్యాదపూర్వకంగా కలిసింది.

‘‘గతంలో సమ్మె నోటీసు ఇచ్చిన జెన్ కో  కార్మికులు, ఇతర ఉద్యోగులపై అప్పటి బీఆర్ఎస్​ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడింది. పలువురు కార్మికులు, ఉద్యోగులను తొలగించింది. అధికారులను డిమోట్ చేసింది. వాటిని సరి చేయడంతోపాటు, సింగరేణి, జెన్ ట్రాన్స్ కో సంస్థలకు సమర్థులైన అధికారులను నియమించాలి’ అని సీఎంను కోరినట్లు వారు చెప్పారు.