హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో తాగు, సాగునీటి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని సీపీఐ రౌండ్ టేబుల్ మీటింగ్ లో పాల్గొన్న నేతలు తెలిపారు. మైనర్, మధ్యతరహా, భారీ తరహా ప్రాజెక్టులను పూర్తి చేసి 54 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని చెప్పారు. సీపీఐ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో మంగళవారం హిమాయత్ నగర్ లోని మక్దూం భవన్లో రాజ బహదూర్ గౌర్ హాల్ లో తాగు, సాగు నీటి ప్రాజెక్టులపై పశ్య పద్మ అధ్యక్షతన రౌండ్ టేబుల్ మీటింగ్ జరిగింది.
ఈ సమావేశంలో రిటైర్డ్ ఇంజినీర్ కె. విఠల్ రావు, సారంపల్లి మల్లారెడ్డి, ఏఐకేఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు సాంబశివరావు, ఎస్కేం రాష్ట్ర కన్వీనర్లు భిక్షపతి, జక్కుల వెంకటయ్య, పట్లోళ్ల నాగిరెడ్డి, విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో రెండు పెద్ద నదులు కృష్ణ , గోదావరి ప్రవహిస్తున్నాయని పేర్కొన్నారు. సుమారుగా 43% ఏరియా కృష్ణ బేసిన్లో, 56% ఏరియా గోదావరి బేసిన్లో ఉన్నదని వెల్లడించారు.
