రైతుబంధులో మార్పులు భేష్.. సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని

రైతుబంధులో మార్పులు భేష్.. సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం గొప్పలకు పోకుండా వాస్తవికత ఆధారంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్​ను ప్రవేశపెట్టిందని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. గత ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ కంటే ఎక్కువ ఉండాలన్న భేషజాలకు పోలేద న్నారు. ప్రతిపాదించిన నిధులను పూర్తి స్థాయిలో కేటాయిస్తే ఇది మంచి బడ్జెట్​గా నిలుస్తుందన్నారు. బడ్జెట్​పై శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు.

గత ప్రభుత్వం రూ.2.90 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టినా.. చివరకు అంచనాలను సవరించి రూ.66 వేల కోట్లను తగ్గించిం దన్నారు. ఈ బడ్జెట్ మాత్రం వాస్తవికంగా ఉందన్నారు. అలాగే భూమి సాగు చేస్తున్న వారికి, కౌలు రైతులకే రైతుబంధు ఇవ్వాలని, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, రోడ్ల కింద పోయిన భూములకు, స్థలం లేనివారికి  రైతుబంధు ఇవ్వకూడదని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామ న్నారు. నియోజకవర్గంలో 3,500 ఇండ్లు, మండలానికో తెలంగాణ పబ్లిక్ స్కూల్ వంటి నిర్ణయాలు బాగున్నాయన్నారు.