
ముగ్ధు భవన్ లో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు సీపీఐ జాతీయ కార్య దర్శి నారాయణ. మీడియితో మాట్లాడిన ఆయన .. ఐదేండ్ల కాలంలో తెలంగాణను KCR అప్పుల తెలంగాణ గా మార్చారని అన్నారు. ఇప్పటికైనా ప్రజలు ఏకం కాకపోతే.. రాష్ట్రం మరింత ప్రమాదంలో పడిపోతుందని చెప్పారు. అసెంబ్లీలో ప్రతి పక్షం లేకుండా చేసినందుకు లోక్ సభ ఎన్నికలలో ప్రజలు కేసీఆర్ కు బుద్ధి చెప్పారని అన్నారు నారాయణ.
ఇంటర్ విద్యార్థులను కేసీఆర్ ప్రభుత్వం పొట్టన పెట్టుకుందని నారాయణ. తెలంగాణ ప్రభుత్వానికి రానున్న రోజుల్లో ప్రజలు మరింత గుణపాఠం చెప్తారని అన్నారు. ఆరోపించారు మోడీ కేబినెట్ లో 56మంది మంత్రులలో 52మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని చెప్పారు