ఎన్డీఏలో కూటమిలో ఆ పార్టీలు తప్ప మిగితావి ఉత్తయే : నారాయణ

 ఎన్డీఏలో కూటమిలో ఆ పార్టీలు తప్ప మిగితావి ఉత్తయే :  నారాయణ

దేశ వ్యాప్తంగా బీజేపీ గ్రాఫ్ పడిపోతుందని, ఎన్డీఏలో కూటమి లో ఉన్న  8 పార్టీలు తప్ప మిగితా పార్టీలన్నీ ఉత్తవేనన్నారు   సీపీఐ జాతీయ కార్యదర్శి  నారాయణ. జమిలీపై కేంద్రం వేసిన కమిటీ ఒక బోగస్ అని విమర్శించారు. అమిత్ షా రాసిన స్క్రిప్ట్ కు వీళ్ళు సంతకాలు పెట్టడం తప్ప చేసేదేమీ లేదన్నారు.  సీపీఐ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు.   రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో వేసిన జమిలీ కమిటీ ని తాము బహిష్కరించాలని చూస్తున్నామన్నారు. ఈ కమిటీ ని అందరం కలిసి కట్టుగా నిర్వీర్యం చేయాలని పిలుపునిచ్చారు. ఎంఐఎంపై ఐటీ, ఈడి రైడ్స్  చేస్తే కోట్లాది రూపాయలు బయట పడుతాయని చెప్పారు. కేసీఆర్ కూడా బీజేపీకి వత్తాసు పలుకుతున్నారని, లిక్కర్ కేసులో కవితను అరెస్ట్ చేస్తారనే  బీజేపీకి సపోర్ట్ గా ఉంటున్నారని ఆరోపించారు.  

జమిలీ ఎన్నికలపై  రాజకీయ పార్టీలతో కేంద్రం చర్చించలేదని,  పార్టీలతో చర్చించకుండా రాజ్యాంగ సవరణ ఎలా చేస్తారని నారాయణ  ప్రశ్నించారు.  త్వరలో జరగనున్న 5రాష్ట్రాల ఎన్నికలు వచ్చే ఏడాదికి వాయిదా వేసి  మరికొన్ని రాష్ట్రాలను కలిపి మొత్తం 10 రాష్ట్రాల ఎన్నికలతో పార్లమెంట్ ఎన్నికలు పెట్టాలని   కేంద్రం చూస్తోందన్నారు. ఇండియా కూటమిని చూసి బీజేపీ భయపడిందన్నారు. ఇండియా కూటమి సమావేశం జరిగిన వెంటనే ప్రత్యేక నోటిఫికేషన్ ఇచ్చి పార్లమెంట్ సమావేశాలు నిర్వహిస్తోందన్నారు. 

ఇస్రో శాస్త్రవేత్తలకు నారాయణ శుభాకాంక్షలు తెలిపారు. సైన్స్ పరంగా  ఇస్రోను అందరం అభినందించాల్సిందేనన్నారు నారాయణ . కానీ మోదీ ఇస్రో ప్రయత్నాలకు  మతం రంగు పులామలని చూస్తున్నారని మండిపడ్డారు. దీన్ని అవకాశంగా వాడుకోవాలని చూస్తున్నారు. గతంలో దేశ వ్యాప్తంగా కొన్ని కారణాల వల్ల బీజేపీ గెలిచిందని,ఇప్పుడు ఆ పరిస్థితి మారిందన్నారు. మణిపూర్ లో ఘటనలు చాలా బాధాకరమని తెలిపారు.