కాంగ్రెస్, వామపక్షాలు కలిస్తే..బీఆర్ఎస్ కు డిపాజిట్ రాదు: నారాయణ

కాంగ్రెస్, వామపక్షాలు కలిస్తే..బీఆర్ఎస్ కు డిపాజిట్ రాదు: నారాయణ

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి పోటీ చేస్తే బీఆర్ఎస్ కు డిపాజిట్ కూడా రాదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. అయితే కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలను కలుపుకుంటుందా లేదా అన్నది తనకు తెల్వదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కామ్రేడ్ల కూటమి నిశ్చితార్థం స్టేజీలో ఉందన్నారు.  

తెలంగాణ బాగుపడాలంటే ఈ మూడుపార్టీలు కలవాలని. ఓట్ల ప్రాతిపదికన కాకుండా ఒకరికి ఒకరు అవసరం అనే అంశంపై పొత్తులపై చర్చ జరపాలన్నారు. మునుగోడు  ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ,బీఆర్ఎస్ కు మద్దతిచ్చామన్నారు. ఇపుడు రాజకీయ పరిస్థితులు మారాయని.. కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం ఎక్కువని..లోపల బయట నాయకులు కొట్టుకుంటారన్నారు. కాంగ్రెస్, వామపక్షాలు కలిస్తే తెలంగాణలో కేసీఆర్ కు డిపాజిట్ కూడా రాదని ధీమా వ్యక్తం చేశారు.