
సీఎం కేసీఆర్ తీరుపై మండిపడ్డారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. అంబేద్కర్ విగ్రహావిష్కరణకు, కొత్త సచివాలయ ప్రారంభోత్సవానికి ప్రతిపక్షాలను పిలవకుండా ఏకపక్షంగా వ్యవహరించడాన్ని ఆయన తప్పు పట్టారు. సీఎం కేసీఆర్ ఒక్కరే బీజేపీపై పోరాడాలని అనుకుంటున్నారా..? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ ..ప్రతిపక్షాలను కలుపుకొనిపోవాలని సూచించారు.
సమైక్య వాదాన్ని,సెక్యూలరిజాన్ని దెబ్బకొట్టి, విద్యా వ్యవస్థను, రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రధానమంత్రి మోడీ ప్రయత్నిస్తున్నారని నారాయణ ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో పర్యటించిన సీపీఐ నేత నారాయణ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు.