
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ ముగిసినట్లేనని కామెంట్ చేసి కార్మికులకు మానసిక క్షోభ కలిగిస్తున్నారని సీఎం కేసీఆర్ పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి మండిపడ్డారు. సమ్మె విషయంలో వేరే అభిప్రాయాలే మున్నా పక్కకుపెట్టి చర్చలకు పిలవాలన్నారు. గురువారం హైదరాబాద్ లో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం చర్చలకు పిలవకపోతే శనివారం నుంచి నుంచి ఇందిరాపార్కు వద్ద నిరవధిక నిరాహార దీక్షను చేపట్టనున్నట్లు తెలిపారు. పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు దీక్షకు కూర్చుం టారని చెప్పారు. దీక్షకు పర్మిషన్ కోసం పోలీసు అధికారులకు లేఖ రాసినట్లు తెలిపారు.