ఎన్నికలు వేరు.. ఉద్యమాలు వేరు..

ఎన్నికలు వేరు.. ఉద్యమాలు వేరు..

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీపై రెండ్రోజుల్లో చెప్తం 

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి

హైదరాబాద్​, వెలుగు: గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీపై రెండు రోజుల్లో నిర్ణయం చెప్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​రెడ్డి చెప్పారు. ఇప్పటికే సీపీఎం, ఇతర వామపక్షాలతో చర్చించామన్నారు. బుధవారం ఆయన మగ్దూం భవన్​లో మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ బరిలో నిలిచిన కోదండరామ్​పై తమకు మంచి అభిప్రాయం ఉందని, కానీ, ఎన్నికలు, ఉద్యమాలు వేరని చాడ అన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో పోటీ చేయట్లేదన్నారు. ఎన్నికల్లో బీజేపీని ఓడించే లౌకిక పార్టీకి మద్దతిస్తామన్నారు. ఎవరికి మద్దతివ్వాలన్న దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రాష్ర్టం వచ్చి ఆరేండ్లు  దాటినా, ఏపీ పునర్విభజనచట్టంలో అంశాలను పరిష్కరించకుండా కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల మధ్య లొల్లి పెడుతోందని విమర్శించారు. కేంద్రం తీసుకువచ్చిన మూడు రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలకు నిరసనగా ఈ నెల 12 నుంచి 18వ తేదీ వరకు నిరసన వారం పాటించనున్నట్టు చెప్పారు. 13న డబుల్​ బెడ్రూం ఇండ్లపై హైదరాబాద్​ కలెక్టరేట్​ వద్ద ధర్నాలు చేస్తామని ఆయన చెప్పారు.

For More News..

‘గాంధీ’లో రెండు నెలలుగా జీతాల్లేవ్‌‌

దసరా నుంచి కొత్త సెక్రటేరియట్ పనులు

తెలంగాణకు మళ్లీ నీళ్ల గాయం