బీఆర్ఎస్​ పిలుపుకోసం వెయిట్ చేద్దాం.. పొత్తులపై సీపీఎం, సీపీఐ నిర్ణయం

బీఆర్ఎస్​ పిలుపుకోసం వెయిట్ చేద్దాం.. పొత్తులపై సీపీఎం, సీపీఐ నిర్ణయం

హైదరాబాద్, వెలుగు: రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్​తో కలిసి ఎన్నికల్లో పోటీచేయాలనే భావనతోనే లెఫ్ట్ పార్టీలు ఉన్నాయి. పొత్తులపై బీఆర్ఎస్ పిలుపుకోసం ఇంకొన్ని రోజులు వేచిచూడాలని సీపీఎం, సీపీఐ పార్టీలు నిర్ణయించాయి. సోమవారం హైదరాబాద్​లోని మగ్దుంభవన్​లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు నేతృత్వంలోని ఆయా పార్టీల ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో పొత్తులు, కేంద్రంలోని బీజేపీ తెస్తున్న విధానాలపై చర్చించారు. త్వరలోనే బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతున్నందున ఇంకొంత కాలం వేచిచూడాలని నిర్ణయించారు. బీఆర్​ఎస్ ప్రకటించే స్థానాల్లో సీపీఎం, సీపీఐ పార్టీలు ఆశించిన సెగ్మెంట్లు ఉంటే.. అప్పుడు బీఆర్ఎస్​తో పొత్తుపై నిర్ణ యం తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. మరోపక్క సీపీఎం, సీపీఐ పోటీ చేయాలనుకున్న స్థానాల్లో పొత్తులతో సంబంధం లేకుండానే తమ పనినికి కొనసాగించాలని సమావేశంలో నిర్ణయించారు. 

ALSO READ:టీచర్ల సమస్యలపై ఉద్యమిస్తమన్న జాక్టో స్టీరింగ్ కమిటీ