CPM నాయకులు రైల్వే ట్రాకులపై బాంబులు పెడుతున్నరు

CPM నాయకులు రైల్వే ట్రాకులపై బాంబులు పెడుతున్నరు

భారత్ బంద్ పేరుతో సీపీఐఎం నాయకులు రాష్ట్రంలో హింసాత్మక వాతావారణం సృష్టించారని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఉద్యమం పేరుతో పేరిట ప్రయాణికులను కొట్టారని.. రాళ్లు విసిరారని, రైల్వే ట్రాకులపై బాంబులు పెట్టారని ఆమె అన్నారు.  సీపీఐది ఉద్యమం కాదని.. దాదాగిరి అని పేర్కొన్నారు. ఈ హింసాత్మక ఘటనలను, ఆందోళనలను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్టు స్పష్టం చేశారు. బంద్‌ పేరిట పబ్లిసిటీ సంపాదించాలని వారు(సీపీఎం నాయకులు) అనుకుంటున్నారు. ఇలాంటి చీప్‌ పబ్లిసిటీ సంపాదించడం కంటే.. రాజకీయంగా చావడమే మంచిది అని సీఎం మమత అన్నారు.