
- సీపీఎం నేత ఎండీ అబ్బాస్
చేర్యాల, వెలుగు: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులేనని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎండీ అబ్బాస్అన్నారు. గురువారం మండల కేంద్రంలోని భద్రకాళి ఫంక్షన్ హల్ లో చేర్యాల పట్టణం, చేర్యాల రూరల్, కొమురవెల్లి, మద్దూరు, ధూల్మిట్ట మండలాల ప్రాంతీయ కార్యకర్తల రాజకీయ శిక్షణ తరగతులు జరిగాయి. ఈ తరగతులకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన కమ్యూనిస్టు ఉద్యమ విశిష్టత - పార్టీ నిర్మాణం అనే అంశంపై బోధించారు.
సమాజంలో దోపిడీకి గురవుతున్న కష్టజీవులకు అండగా ఉండేది ఎర్రజెండా మాత్రమే అన్నారు. ప్రజా సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ ప్రజల పక్షాన నిలబడి పోరాడుతున్నది కమ్యూనిస్టులేనని అన్నారు. సీపీఎం సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి మాట్లాడుతూ సెప్టెంబర్ 16న బైరాన్ పల్లి అమరవీరుల సంస్కరణ సభ బైరాన్ పల్లిలో జరుగుతుందని ఈ సభకు ముఖ్య అతిథిగా సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్క రాములు హాజరవుతున్నారని తెలిపారు. తరగతులకు వెంకట మావో ప్రిన్సిపాల్ గా వ్యవహరించగా నాయకులు యాదవ రెడ్డి, ఆలేటి యాదగిరి, అరుణ్, కృష్ణారెడ్డి, కుమార్, రవీందర్, షపీ , ప్రశాంత్, శోభ, శ్రీహరి, రంజిత్ రెడ్డి, కరీం పాల్గొన్నారు.