
అబ్దుల్లాపూర్‌మెట్, వెలుగు: కష్టజీవులకు ఎప్పుడూ ఎర్రజెండా అండగా ఉంటుందని సీపీఎం పొలిట్ బ్యూరో మెంబర్బీవీ రాఘవులు అన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట దినోత్సవ వారోత్సవాల సందర్భంగా రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్మండలం అనాజ్‌పూర్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. రైతులు, కూలీలు, కష్టజీవుల కోసమే ఎర్రజెండా పుట్టిందన్నారు. పేద ప్రజలు కష్టాల్లో ఉన్నారని తెలిస్తే ఎర్ర జెండా అండగా నిలబడుతుందన్నారు.