బీసీ రిజర్వేషన్‌‌పై కేంద్రమంత్రులు స్పందించాలి : సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌ వెస్లీ

బీసీ రిజర్వేషన్‌‌పై కేంద్రమంత్రులు స్పందించాలి : సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌ వెస్లీ
  • ఇండియా, పాక్‌‌ యుద్ధం ఆపడంలో ట్రంప్‌‌ జోక్యం ఉందా ?

అచ్చంపేట, వెలుగు : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంపై కేంద్రమంత్రులు బండి సంజ య్, కిషన్‌‌రెడ్డి స్పందించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌ వెస్లీ డిమాండ్‌‌ చేశారు. గురువారం అచ్చంపేటలో మీడియాతో మాట్లాడుతూ ట్రంప్‌‌ జోక్యం కారణంగానే ఇండియా, పాక్‌‌ యుద్ధం ఆగిందని వస్తుందన్న ఆరోపణలపై ప్రధాని మోదీ పార్లమెంట్‌‌లో సమాధానం చెప్పాలని డిమాండ్‌‌ చేశారు. పాక్‌‌ ఆక్రమిత కశ్మీర్‌‌ను స్వాధీనం చేసుకునే వరకు యుద్ధం చేస్తామని చెప్పి.. రెండు రోజులకే ఎందుకు ముగించారని ప్రశ్నించారు.

కేంద్రమంత్రులు కిషన్‌‌రెడ్డి,బండి సంజయ్‌‌ స్పందించి మోదీపై ఒత్తిడి తీసుకొచ్చి బీసీ రిజర్వేషన్‌‌ అమలుకోసం చొరవ చూపాలని డిమాండ్ చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలైన రాజస్తాన్‌‌, గుజరాత్‌‌ వంటి రాష్ట్రాల్లో రిజర్వేషన్‌‌ పెంచుకునే అవకాశం ఉన్నప్పుడు, తెలంగాణలో ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌‌ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు సాగర్, వెంకట్‌‌రాములు, ఎం.ధర్మానాయక్, పర్వతాలు, దేశ్యానాయక్‌‌, శంకర్‌‌నాయక్‌‌, నాగరాజు పాల్గొన్నారు.