
హైదరాబాద్, వెలుగు: దేశంలో మతోన్మాదం విస్తరిస్తోందని, దాన్ని తిప్పికొట్టాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్య తెలిపారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలువకుండా, దాన్ని ఒంటరిని చేయాలని కోరారు. బుధవారం సీపీఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రెడ్ బుక్ డే నిర్వహించారు.
ఈ సందర్భంగా వీరయ్య మాట్లాడుతూ... మూడోసారి మోదీ అధికారంలోకి వస్తారనే ప్రచారం జరుగుతోందని, అదే జరిగితే దేశం ఏం అవుతుందనే ఆందోళన ప్రజాస్వామ్య వాదుల్లో మొదలైందని తెలిపారు. హిట్లర్ ఉన్న దేశంలో విప్లవం వచ్చిందని, ముస్సోలిని ఉన్న దేశంలో ప్రజాస్వామ్యం పునరుద్ధరించబడిందని గుర్తుచేశారు. అదే పరిస్థితి మోదీకి రానున్నదని చెప్పారు.