సీసీఐను తెరిపించేందుకు కేటీఆర్ కృషి చేయాలె

సీసీఐను తెరిపించేందుకు కేటీఆర్ కృషి చేయాలె

ఆదిలాబాద్: సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)ను తుక్కు కింద అమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేయడం దుర్మార్గమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. జిల్లాలో మూతపడిన సీసీఐను శనివారం సీపీఐ నేతలు, సీసీఐ సాధన కమిటీ, భూ నిర్వాసితులతో కలిసి  తమ్మినేని వీరభద్రం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఫ్యాక్టరీని తిరిగి తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ... కేంద్రం స్పందించకపోవడం బాధాకరమన్నారు. సీసీఐపై కేబినెట్ లో స్పష్టమైన నిర్ణయం తీసుకునేలా మంత్రి కేటీఆర్ కృషి చేయాలని కోరారు. 

ఫ్యాక్టరీ శాశ్వతంగా మూతపడితే దాదాపు 2 వేల కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీని తెరిపించేందుకు అన్ని పార్టీలు, కార్మిక సంఘాలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. అప్పట్లో పేదల దగ్గర తక్కువ ధరకు భూములు లాక్కొని... ఇప్పుడు ఆ భూములు అమ్మేందుకు కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. ఒకవేళ ఫ్యాక్టరీని శాశ్వతంగా మూసివేస్తే పేదలకు తమ భూములు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు వెంటనే తగు నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

మరిన్ని వార్తల కోసం...

నవీన్ పట్నాయక్ కీలక నిర్ణయం

నిందితులకు శిక్ష పడేంత వరకు పోరాడుతాం