వేములవాడ, వెలుగు: వేములవాడ రాజన్న ఆలయ అనుబంధ భీమేశ్వర ఆలయంలో సిబ్బందికి సీపీఆర్‌పై అవగాహన కల్పించారు. శుక్రవారం సిరిసిల్ల ప్రభుత్వ హాస్పిటల్ అసోసియేట్ ప్రొఫెసర్ చీకోటి సంతోష్, డాక్టర్ నాగరాజన్ ఆధ్వర్యంలో భీమేశ్వర సదన్ పార్కింగ్ ప్రదేశంలో ఆలయ ఉద్యోగులు, ఎస్పీఎఫ్, హోంగార్డ్ సిబ్బందికి అత్యవసర పరిస్థితుల్లో సీపీఆర్ ఎలా చేయాలో అవగాహన కల్పించారు.
భక్తుల భద్రతకు ఫస్ట్ ఎయిడ్, సీపీఆర్ ఎంతో అత్యవసరమన్నారు. ఆలయ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరై శిక్షణ పొందారు. డీఈ రఘునందన్, ఏఈవో శ్రావణ్ కుమార్, ఏఈ రామకృష్ణారావు, పర్యవేక్షకుడు శ్రీనివాస్ శర్మ, డాక్టర్లు దివ్య, రాకేశ్, లయన్స్ క్లబ్ సభ్యుడు శ్రీనివాస్ పాల్గొన్నారు.
